అక్కినేని ఫ్యాన్స్ కి పూనకాలే…అఖిల్ మూడో సినిమా డైరెక్టర్ ఈయనే!!

  తొలి సినిమా అఖిల్ తో అదిరిపోయే ఎంట్రీ ఇద్దామనుకున్న అఖిల్ కి ఆ సినిమా భారీ షాక్ నే ఇచ్చినా అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించి పెట్టింది. అదే ఊపుతూ క్లాస్ లవ్ స్టొరీ చేసి హలో గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ కి పాజిటివ్ రివ్యూలు దక్కినా కమర్షియల్ మూవీ తో పోటి పడటం పెద్ద ఎదురు దెబ్బ గా నిలిచింది. దాంతో అఖిల్ తర్వాత సినిమా ఎవరి తో ఉంటుందా అనేది ఆసక్తి గా మారింది.

చాలామంది డైరెక్టర్స్ ని అనుకున్నా కానీ ఎవరితోనూ ఫైనల్ కాని అఖిల్ సినిమా ఎట్టకేలకు ఓ డైరెక్టర్ తో ఫైనల్ అవ్వడం ఖాయంగా మారింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు…రీసెంట్ గా తొలిప్రేమ సినిమాతో అద్బుతమైన విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.

తొలి సినిమానే అయినా అద్బుతంగా కథని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి అఖిల్ కోసం అదిరిపోయే కథని చెప్పగా అఖిల్ కన్ఫాం అనేశాడని సమాచారం. అతి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండబోతుందట. దాంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ సారి అఖిల్ అదిరిపోయే నికార్సయిన హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు.

Leave a Comment