అక్కడ చుక్కలే…మరి ఇక్కడ పరిస్థితి ఏంటి?

అజ్ఞాతవాసి మూవీ విషయంలో జనాల దగ్గర ఇప్పటికే ఫుల్ క్లారిటీ ఉంది. కానీ ఎక్కువ షోస్ ప్రదర్శించుకోవడం.. ముందు రోజే ప్రీమియర్స్ టెలికాస్ట్ చేసుకోవడం వంటి వాటిపై.. ఏపీలో మాంచి క్లారిటీ వచ్చేసింది. రోజుకు 7 షోస్ చొప్పున.. రిలీజ్ అయినదగ్గర నుంచి 7 రోజుల పాటు ప్రదర్శించుకునే ఛాన్స్ వచ్చింది. కానీ ప్రీమియర్స్ విషయంలో తెలంగాణలో ఎలాంటి స్పష్టత రావడం లేదు.

వారం రోజుల క్రితం స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్లి మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. గంటా పది నిమిషాల పాటు వెయిట్ చేసి మరీ సీఎం ని కలిసొచ్చాడు పవర్ స్టార్. ఇలా ఓ సినిమా కోసం.. దాని ప్రీమియర్స్ కోసం పవన్ వెళ్లి అడిగి ఉంటాడా అంటే సందేహమే కానీ.. ప్రచారం అయితే అదే జరుగుతోంది. అయితే పవన్ అడిగినా సరే.. ఇప్పటివరకూ అజ్ఞాతవాసి ప్రీమియర్స్ పై క్లారిటీ రాలేదు. నిజానికి ఏడాదిగా ఇక్కడ మిడ్ నైట్ షోస్ లాంటివి పడలేదు. బాహుబలి2కి మాత్రం.. ఉదయం 7 తర్వాత షోస్ వేసుకునేందుకు పర్మిషన్ వచ్చింది. మరి ఇప్పుడు అజ్ఞాతవాసికి ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కనిపిస్తోంది

Leave a Comment