అల్లు అర్జున్ ఇలాంటి షాక్ ఇస్తాడని ఊహించనే లేదు!!

  స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో టాలీవుడ్ అత్యధిక సార్లు 50 కోట్ల షేర్ ని అందుకున్న హీరోగా మొదటి రికార్డ్ కొట్టిన హీరోగా మార్చిన అల్లు అర్జున్ ఇప్పుడు నా పేరు సూర్య సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టించడానికి ఏప్రిల్ 26 న రాబోతున్నాడు. సమ్మర్ రేసులో పోటి ఉన్నా వెనుతిరగకుండా అనౌన్స్ చేసిన డేట్ కే రచ్చ చేయనున్నాడు.

ఇక సినిమాకి బిజినెస్ పరంగా అన్ని ఏరియాల్లో అద్బుతమైన ఆఫర్స్ వెల్లువ వస్తుంది. సినిమాకి నైజాంలో అయితే ఆల్ టైం అల్లుఅర్జున్ కెరీర్ బిగ్గెస్ట్ రేటు దక్కడం విశేషంగా మారింది. యావరేజ్ కంటెంట్ తో దువ్వాడ జగన్నాథం సినిమానే 19 కోట్ల షేర్ ని అందుకుంది.

దాంతో ఇప్పుడు నాపేరుసూర్య కి ఏకంగా 21.5 కోట్ల రేటు ఫైనల్ అవ్వడం చూసి పోటి లో కూడా ఇంత రేటు దక్కడం చూసి అంతా షాక్ అవుతున్నారు. అల్లుఅర్జున్ రేంజ్ ఇప్పుడు భారీ గా పెరిగిపోవడంతో ఈ సినిమా కనుక అంచనాలను అందుకుంటే ఓ రేంజ్ లో రచ్చ చేయడం ఖాయం అంటున్నారు.

Leave a Comment