అల్లుఅర్జున్ ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసిన జైలవకుశ ట్రైలర్…మాస్ హిస్టీరియా

0
3208

టాలీవుడ్ లో యూట్యూబ్ రికార్డుల జోరు సినిమా సినిమాకి పెరిగిపోతుంది…భారీ అంచనాలతో వస్తున్న సినిమాల రికార్డులు యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుండగా ఒక్కో హీరో సినిమా సీజన్ ని బట్టి భీభత్సం సృష్టిస్తూ దూసుకుపోతుంది. కాగా బాహుబలి పార్ట్ 2 ట్రైలర్ మాత్రం ఎవ్వరికీ అంద నంత ఎత్తులో టాప్ ప్లేస్ లో 20 మిలియన్ వ్యూస్ కి పైగా వ్యూస్ ని దక్కించుకుని టాప్ చెయిర్ లో కూర్చుని ఎంజాయ్ చేస్తుంది.

దాంతో మిగిలిన సినిమాలన్నీ నాన్ బాహుబలి రికార్డులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కాగా బాహుబలి ని పక్కకు పెడితే టాప్ చెయిర్ లో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ దువ్వాడ జగన్నాథం 4.6 మిలియన్ వ్యూస్ ని 24 గంటల్లో సాధించి టాప్ ప్లేస్ లో ఉండగా…

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఆ రికార్డును 19 గంటల్లోనే బ్రేక్ చేసింది…దుమ్ము లేపింది…దాంతో టాప్ చెయిర్ లో యంగ్ టైగర్ కూర్చోగా ఈ రికార్డ్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here