ఇదేమి రికార్డ్ సామి…శిఖరం అంత రికార్డ్ కొట్టిన స్టైలిష్ స్టార్..

0
379

  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేకపోయింది. కాగా సినిమా ఓవరాల్ గా మొదటి వారంలో కేవలం 46 కోట్ల రేంజ్ లో నే షేర్ ని అందుకోగా సినిమా మొత్తం మీద ఎంత దూరం వెళుతుంది అనేది ఇప్పుడు అందరి లోను ఎంతో ఆసక్తి ని రేపుతుంది.

కాగా ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో హిస్టారికల్ రికార్డ్ ను ఈ సినిమా తో సాధించాడు. ఈ సినిమా తో అల్లు అర్జున్ నైజాం ఏరియా లో అత్యధిక సార్లు 10 కోట్ల మార్క్ ని అందుకున్న హీరోగా నిలిచి సెన్సేషనల్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు.

అల్లుఅర్జున్ కెరీర్ లో…. జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం మరియు నా పేరు సూర్య సినిమాలు నైజాం లో 10 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. నైజాం లో ఇన్ని సార్లు 10 కోట్ల మార్క్ ని అందుకున్న ఏకైక హీరో అల్లు అర్జున్ అవ్వడంతో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here