మెర్సల్ డైరెక్టర్ ఎన్టీఆర్ సినిమా…ఊచకోత ఖాయామా

0
440

  వరస హిట్లతో కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీకి చెన్నైలో క్రేజ్ బాగా పెరిగింది. అట్లీ తీసింది మూడే సినిమాలే అయినా అన్నీ బాక్సాఫీసును బాగానే ఆకట్టుకున్నాయి. చివరగా తమిళ స్టార్ హీరో విజయ్ తో చేసిన మెర్సల్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీంతో అట్లీతో కలిసి పనిచేసేందుకు కోలీవుడ్ హీరోలతోపాటు టాలీవుడ్ హీరోలు తెగ ఉత్సాహపడుతున్నారు. ఇంతకుముందు తన తరవాత సినిమా తెలుగులో చేస్తానని అట్లీ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ లేదా మహేష్ లలో ఎవరో ఒకరితో సినిమా చేసే అవకాశం ఉందని టాక్ కూడా వినిపించింది.

ఇంతలో ఏమయిందో అట్లీ మాట మార్చేశాడు. తాను ఏ తెలుగు హీరోతోనూ సినిమా చేయడం లేదని ప్రకటించాడు. పైకి అలా చెప్పినా టాలీవుడ్ స్టార్ హీరోలతో టచ్ లోనే ఉన్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ తో అట్లీ సీక్రెట్ మీట్ అయ్యాడట. వీళ్లిద్దరూ కలిసి ఏ తరమా సినిమా చేస్తే బావుంటుందనే దానిపైనే డిష్కషన్స్ సాగాయని తెలుస్తోంది. అట్లీ కూడా ఎన్టీఆర్ కు సూటయ్యే సబ్జెక్టు కోసం వేట మొదలుపెట్టాడనేది లేటెస్ట్ టాక్.

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి డైరెక్షన్లో చరణ్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాల్సి ఉంది. అది కూడా పూర్తయ్యాక కానీ ఎన్టీఆర్ డైరీ ఖాళీ అవదు. అందుకే వీళ్లిద్దరూ కలిసి పనిచేయడం గురించి సీక్రెట్ గా ఉంచేశారు. త్రివిక్రమ్ – రాజమౌళి సినిమాల తరవాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. సో అట్లీ తెలుగులో చేస్తే.. అది ఎన్టీఆర్ తో అనమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here