బాలయ్య మాస్ పవర్…8.2 కోట్లతో కెరీర్ లో అల్టిమేట్ రికార్డ్

0
709

  నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ జైసింహా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సింహా అనే టైటిల్ బాలయ్య కి ఎక్కువ శాతం కలిసి రావడం తో ఈ సినిమా కోసం అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య చేసిన పైసా వసూల్ అంచనాలను అందుకోవడం భారీ గా విఫలం అవ్వగా సంక్రాంతి కి రానున్న జైసింహా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందా అనేది ఎదురు చూస్తున్నారు.

కాగా సినిమా బిజినెస్ విషయం లో ఇప్పటి నుండే జోరు చూపుతుండగా బాలయ్య కెరీర్ లో రికార్డ్ లెవల్ లో సినిమా సీడెడ్ రైట్స్ అమ్ముడు పోయినట్లు సమాచారం. సుమారు సినిమా రైట్స్ 8.2 కోట్ల రేటు దక్కించు కున్నట్లు చెబుతున్నారు.

రాయలసీమ లో బాలయ్య క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేటు కూడా అదిరిపోయే లెవల్ లో దక్కడం తో సంక్రాంతి కి సినిమా అక్కడ అద్బుతమైన వసూళ్లు రాబట్టడం ఖాయమని అంటున్నారు. కాగా త్వరలోనే సినిమా ఆడియో ఈవెంట్ జరగబోతుందని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here