రీమేక్ సినిమా చేద్దాం అన్నారు…నా ఆన్సర్ ఇదే!!

0
434

  తెలుగులో కొందరు హీరోలు అస్సలు రీమేక్‌ల జోలికి వెళ్లరు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మహేష్ బాబుదే. హీరో అయ్యాక ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రీమేక్‌లో నటించలేదు మహేష్. రీమేక్ అనగానే తనకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ కలగదని.. కాబట్టి ఎప్పటికీ రీమేక్ చేయనని అని చాలాసార్లు కుండబద్దలు కొట్టాడు మహేష్. ఇక సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ కూడా రీమేక్‌ల పట్ల విముఖత చూపిస్తుంటాడు. ఆయన కెరీర్లో రీమేక్‌లు చాలా చాలా తక్కువ.

చివరగా బాలయ్య చేసిన రీమేక్ ‘లక్ష్మీనరసింహా’. అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తన కొత్త సినిమా ‘జై సింహా’ కోసం ఇచ్చిన ఒక టీవీ ఇంటర్వ్యూలో భాగంగా రీమేక్‌ల విషయంలో బాలయ్య తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘జై సింహా’ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఎనిమిదేళ్ల కిందటే తనతో సినిమా చేస్తానని వచ్చినట్లు బాలయ్య వెల్లడించాడు.

అప్పుడాయన తనకు ఒక రీమేక్ సినిమా సజెస్ట్ చేశాడని.. కానీ రీమేక్ చేయడం ఇష్టం లేక తాను ఆ సినిమా ఒప్పుకోలేదని బాలయ్య వెల్లడించాడు. రీమేక్ సినిమా చేస్తే.. క్రెడిట్ మొత్తం ఒరిజినల్ హీరోకే వెళ్తుందని.. మనదేమీ ఉండదని.. పైగా తాను ఇంతకుముందు చేసిన రీమేక్ సినిమాలు ఆశించిన ఫలితాలివ్వలేదని.. అందుకే కె.ఎస్‌కు నో చెప్పానని బాలయ్య వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here