అప్పుడు సమరసింహారెడ్డి…ఇప్పుడు జైసింహా…చరిత్ర చిరిగిపోద్ది!!

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోయిన సినిమా ‘సమరసింహారెడ్డి’. 90ల చివర్లో వచ్చిన ఈ సినిమా ఫ్యాక్షన్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ అయింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఐతే ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే బాలయ్యకు దీని ఫలితం తెలిసిపోయిందట. ఈ సినిమా ఆకాశమే హద్దుగా ఆడుతుందని దర్శకుడు బి.గోపాల్ కు ముందే చెప్పాడట బాలయ్య.

ఆ అనుభవం గురించి బాలయ్య చెబుతూ.. ‘‘కొన్నిసార్లు ఈ సినిమా బాగా ఆడుతుందనే విషయం ముందే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయొచ్చు. నేను అలా అనుకున్న ప్రతి సినిమా ఆడింది. ‘సమరసింహారెడ్డి’ షూటింగ్ కర్నూలు పరిసరాల్లో జరిగింది. జయప్రకాష్ రెడ్డి చెయ్యి నరికి.. పవర్ ఫుల్ డైలాగులు చెప్పే సీన్ తీశాం. ఆ సమయంలో యూనిట్ సభ్యులే కాదు.. షూటింగ్ చూడ్డానికి వచ్చిన వాళ్లంతా కూడా చప్పట్లు కొట్టారు. అప్పుడే దర్శకుడు గోపాల్ ను పిలిచి.. ఈ సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో చూడు. ఆకాశమే హద్దు అన్నాను. అన్నట్లే జరిగింది’’ అన్నాడు.

Leave a Comment