బాలయ్య బ్యాటింగ్ షురు…..ఒక్కసారి కన్ఫాం అయితే భీభత్సమే!

0
400

  తెలుగు సినిమాల సంక్రాతి సందడికి ‘అజ్ఞాతవాసి’ తెర తీసింది. ఐతే ఈ చిత్రం అంచనాల్ని మాత్రం అందుకోలేకపోయింది. డివైడ్ టాక్ తో మొదలైన ‘అజ్ఞాతవాసి’కి తొలి రోజు వసూళ్ల విషయంలో మాత్రం ఢోకా లేకపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరిగాయి కాబట్టి రెండో రోజు కూడా వసూళ్లు బాగానే ఉండొచ్చు. ఐతే అంతిమంగా ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఫలితం రావడం మాత్రం కష్టమే. ‘అజ్ఞాతవాసి’ విడుదలకు రెండు రోజుల ముందు నుంచే ఎక్కడ చూసినా ఈ సినిమా మేనియానే కనిపించింది.

సంక్రాంతికి రాబోతున్న వేరే సినిమాలపై ఎవరికీ దృష్టి లేదు. రిలీజ్ రోజు కూడా పాజిటివ్ గానో.. నెగెటివ్ గానో డిస్కషన్లన్నీ దీని చుట్టూనే తిరిగాయి. ఐతే ఒక రోజు గడిచాక జనాలు ‘అజ్ఞాతవాసి’ చర్చల్లోంచి బయటికి వచ్చారు. ఇప్పుడందరి దృష్టీ నందమూరి బాలకృష్ణ సినిమా ‘జై సింహా’ మీదే ఉన్నాయి. ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. ‘అజ్ఞాతవాసి’కి డివైడ్ టాక్ రావడాన్ని ఇది ఏమేరకు సద్వినియోగం చేసుకుంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘జై సింహా’ ప్రోమోలవీ చూస్తే మాస్ జనాలకు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అన్నట్లే ఉంది. సంక్రాంతి సీజన్ కాబట్టి టాక్ ఎలా ఉన్నా మాస్ సెంటర్లలో సినిమా ఆడేయొచ్చు. ఎటొచ్చీ ఎ సెంటర్లలో ఎలా ఆడుతుందనడానికి టాక్ కీలకం. మరి అదెలా ఉంటుందో చూడాలి. ఓవరాల్ గా పాజిటివ్ తెచ్చుకుంటే ‘జై సింహా’ బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలవడానికి ఆస్కారముంది. ఎందుకంటే అసలే సంక్రాంతి సీజన్.. పైగా పోటీగా వచ్చిన పెద్ద సినిమాకు టాక్ ఏమంత బాగా లేదు.

Related posts:

నేనే రాజు నేనే మంత్రి రెండోరోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
నేనే రాజు నేనే మంత్రి 10 రోజుల కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఆగస్టు 25 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ న్యూ టార్గెట్ ఇదే
ఎన్టీఆర్ పేరుకున్న పవర్...85 తో పులికేక పెట్టించాడు
రెండో రోజు పైసావసూల్ బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
“జై” ని మించిన భీభత్సం...[లవ] కుమార్ దిగే రోజు ఇదే...ఫ్యాన్స్ కి పూనకాలే
16.18తో ఎన్టీఆర్ కొట్టిన రికార్డ్ చరిత్రకెక్కింది...ఫ్యాన్స్ కి పూనకాలే
ఆ కత్తి ఎప్పటికైనా ఎన్టీఆర్ దే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్న #125crForJaiLavaKusa...క్రేజ్ పవర్
4.5 టార్గెట్...1.5 రిజల్ట్...టోటల్ ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్
300 కోట్లు కొల్లగొట్టిన సినిమా ఇది....ఊపిరి పీల్చుకున్న ఇండస్ట్రీ
జవాన్ మూవీ రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుకుమార్...ఫ్యాన్స్ కి పూనకాలే
రామ్ చరణ్ ఇంత షాక్ ఇచ్చాడేంటి!!
పాపం దిల్ రాజు...పెట్టింది కొండంత...వచ్చింది గోరంత....షాకింగ్ న్యూస్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here