శాతకర్ణిని మించే బిగ్గెస్ట్ మూవీ చేయబోతున్న బాలయ్య…ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!! | 123Josh.com
Home న్యూస్ శాతకర్ణిని మించే బిగ్గెస్ట్ మూవీ చేయబోతున్న బాలయ్య…ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

శాతకర్ణిని మించే బిగ్గెస్ట్ మూవీ చేయబోతున్న బాలయ్య…ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
2920

  రాధాకృష్ణ జాగర్లమూడి.. టాలీవుడ్ ప్రజలు షార్ట్ గా క్రిష్ అని పిలుస్తూ ఉంటారు. గమ్యం సినిమా తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈ డైరెక్టర్ ఎన్నో మంచి సినిమాలకు దర్శకత్వం వహించాడు. క్రిష్ అందరిలాగా కమర్షియల్ సినిమాలపై అస్సలు మొగ్గుచూపడు. ఎప్పుడు ప్రేక్షకులకు ఎదో ఒకటి కొత్తగా చూపించాలన్న తపనతో వేదం కృష్ణం వందే జగద్గురుమ్ కంచె లాంటి అద్భుతమైన సినిమాలను మనకు అందించాడు. ఇప్పుడు బాలీవుడ్ లో తన ప్రతిభ చాటాలని క్వీన్ కంగనా రనౌత్ తో మణికర్ణిక అనే సినిమా తీస్తున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ ఆగమేఘాల మీద జరుగుతూ ఉండగానే ఇతగాడు తెలుగు లో తన తదుపరి ప్రాజెక్ట్ ఒక పెద్ద హీరో తో చేస్తానని దాని టైటిల్ “అహం బ్రహ్మాస్మి” అని ఎప్పుడో చెప్పేసాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అని తర్జన భర్జన పడుతున్నపుడు తెల్సింది ఏంటి అంటే ఆ హీరో ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ అని. అవును. ఇంతకుముందు గౌతమి పుత్ర శాతకర్ని లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ మళ్ళీ మన ముందు ఇంకొక సినిమాను తీసుకురాబోతోంది.

గౌతమి పుత్ర శాతకర్ని బాలయ్య కు మరియు ఫాన్స్ కు మర్చిపోలేని సినిమా. ఎందుకంటే అది బాలకృష్ణ 100వ సినిమా కాబట్టి. పైగా సూపర్ హిట్ అవడమే కాదు బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డులు సృష్టించిన చారిత్రాత్మక చిత్రం. సాయి బాబు జాగర్లమూడి – రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఎన్‌టి‌ఆర్ బయోపిక్ తర్వాత సెట్స్ పైకి వెళ్లవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here