1.8 కోట్లకు అమ్మితే 30 లక్షలు వచ్చింది…ఎక్కడ తప్పు జరిగిందంటే!!

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ పైసా వసూల్ రీసెంట్ గా ప్రేక్షకులముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా మొదటి రోజు అనుకున్న రేంజ్ లోనే వసూళ్లు రాబట్టిన తర్వాత అనుకున్న రేంజ్ వసూళ్ళని రాబట్టడంలో విఫలం మొత్తం మీద టోటల్ రన్ లో కేవలం 18.2 కోట్ల షేర్ లోపే వసూళ్లు రాబట్టగలిగింది… దాంతో సినిమా మొత్తం మీద నష్టాలను గట్టిగానే దక్కించుకుంది అందరినీ షాక్ ఇచ్చింది.

ఇక సినిమా ఓవర్సీస్ రైట్స్ మొత్తం మీద 1.8 కోట్లకు అమ్ముడు పోగా టోటల్ గా ఇప్పటి వరకు 30 లక్షల షేర్ ని అక్కడ కలెక్ట్ చేసింది…ఈ సినిమా కన్నా ముందు బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి అక్కడ 1.6 మిలయన్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

ఆ హోప్ తోనే పైసా వసూల్ పై భారీ రేటు పెట్టగా ఇప్పుడు ఓవర్సీస్ నుండే సినిమాకు 1.5 కోట్ల లాస్ కన్ఫాం అయ్యింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమాకు భారీ లాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు బాలయ్య అప్ కమింగ్ మూవీ జై సింహ పై పడకుండా ఉండాలని కోరుకుంటున్నాడు.

Leave a Comment