5 రోజుల్లో 34 కోట్లు…బాలయ్య ఏంటయ్యా ఇది!!

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టి తన రేంజ్ ని అమాంతం పెంచేసుకున్న బాలయ్య పక్కా కమర్షియల్ మూవీ చేస్తున్నాడు అంటే మాస్ ఆడియన్స్ లో అంచనాలు పీక్స్ లో పెరిగిపోయాయి…ఆ అంచనాలను అందుకోవడం లో బాలయ్య లేటెస్ట్ మూవీ పైసావసూల్ కొంతవరకు విజయం సాధించి నా కలెక్షన్స్ తెచ్చుకోవడం లో మాత్రం అంత విజయం సాధించ లేదని ట్రేడ్ వర్గాలు పక్కగా చెబు తున్నాయి.

పైసా వసూల్ మొత్తం మీద 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 17.78 కోట్లవరకు షేర్ ని కలెక్ట్ చేయగా అందులో రెండు తెలుగు రాష్ట్రాలలోనే 15 కోట్లకు పైగా షేర్ ని అందుకోగలిగింది…కాగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 15 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ కి మరో 16 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది…ప్రస్తుతం సినిమా ట్రెండ్ ని చూస్తుంటే ఇది కష్టమే అంటున్నారు..ఓవరాల్ గా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 34 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది…

1 Comment

Leave a Comment