బాలయ్య స్పీడ్ కి టాలీవుడ్ షాక్…ఆరోజు ఫ్యాన్స్ కి పండగే

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పైసావసూల్ ఈ దసరాకి రానుంది…మరో కొత్త సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయలాని డిసైడ్ అయ్యాడు బాలయ్య…ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 3 నుండి మొదలు కాబోతుంది.

తర్వాత బోయపాటి సినిమాను మొదలుపెట్టనున్నాడు బాలయ్య…ఆ సినిమా వచ్చే దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ అట…ఇలా వరుస సినిమాలను ఒప్పుకుంటూ యంగ్ హీరోల స్పీడ్ కి డబుల్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు బాలయ్య.

కాగా కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో మొదలు కాబోతున్న సినిమా ఆగస్టు 3 న స్టార్ అవ్వనుండటంతో ఫ్యాన్స్ ఆ రోజు నుండే పండగ చేసుకోవడం ఖాయం అంటున్నారు. ఓ పవర్ ఫుల్ స్టొరీతో ఆ సినిమా తెరకెక్కనుందని సమాచారం…కోలివుడ్ లో అద్బుతమైన విజయాలు అందించిన రవికుమార్ బాలయ్యతో ఎలాంటి అద్బుతాలు చేస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు.

Leave a Comment