బ్రేకింగ్ న్యూస్…ఎన్టీఆర్ మూవీ డైరెక్ట్ చేసేది…బాలయ్యే??

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ పై అంచనాలు పీక్స్ లో ఉన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ తెరకేక్కుతున్నా ఈ సినిమాకి దర్శకుడిగా తేజ ని తీసుకున్న బాలయ్యా ఈ సినిమా విషయంలో అంత సంతోషంగా లేడు అనేది ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వాదన. ముఖ్యంగా తేజ ఈ సినిమా ను పక్కకు పెట్టి వెంకీ తో సినిమా విషయంలో బిజీ గా ఉన్నాడు.

దాంతో బాలయ్య ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడనే టాక్ అంతటా వినిపిస్తుంది. అదేమిటి అంటే ఈ సినిమాకి తానె స్వయంగా దర్శకత్వం వహించాలి అని భావిస్తున్నాడట బాలయ్య. సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అనేక ఇన్సిడెంట్స్ కి బాలయ్య కూడా ఉన్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.

అందుకే తనకన్నా బెటర్ గా తన తండ్రి జీవిత చరిత్రను ఎవ్వరూ బాగా తీయలేరు అని భావించిన బాలయ్య ఈ సినిమాకి తానె డైరెక్షన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. సినిమా మాత్రం 2019 సంక్రాంతి కి రాబోతుంది అనేది ఆల్ మోస్ట్ కన్ఫాం అంటున్నారు.

Leave a Comment