చైనాలో బాహుబలి2 అవుట్ ఇక…దిమ్మతిరిగే షాక్!

0
811

  ఆల్ టైం ఇండియన్ సినిమా ఎపిక్ వండర్ బాహుబలి 2 ఇండియన్ సినిమా చరిత్రలో అనేక రికార్డులను బ్రేక్ చేయగా సినిమా రీసెంట్ గా చైనా లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కాగా మొదటి వీకెండ్ వరకు మంచి వసూళ్ళనే సాధించిన ఈ సినిమా వర్కింగ్ డేస్ విషయానికి వచ్చే సరికి అంచనాలను అందుకోలేక చతికిల బడింది అని చెప్పొచ్చు. ఇక రెండో వారంలో అక్కడ అవెంజర్స్ ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ కానుంది.

దాంతో బాహుబలి 2 థియేటర్స్ చాలా వరకు ఆ సినిమా కి వెల్ల నుండటంతో చైనా లో బాహుబలి 2 ప్రయాణం ఇక చివరి స్టేజ్ కి వచ్చేసినట్లే అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా మొత్తం మీద అక్కడ 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

Fri $ 2.43 mn
Sat $ 2.94 mn
Sun $ 2.30 mn
Mon $ 0.89 mn
Tue $ 0.82 mn
Total: $ 9.38 mn [₹ 63.19 cr]
ఇదీ సినిమా అక్కడ 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…కాగా 25 మిలియన్ మార్క్ ని అందుకుంటే సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుందట. కానీ సినిమా ప్రస్తుత పరిస్థితి చూస్తె మాత్రం అక్కడ 12 మిలియన్ ని అందుకోవడం కూడా కష్టమే అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here