భారీ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ…

0
342

కెరీర్ ఆరంభం నుంచి ఒక లెక్క ప్రకారం సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. బాగా పేరున్న దర్శకుల్ని పెట్టుకుని.. మాస్ మసాలా కథలతో సాగిపోతున్నాడతను. ఈ మీటర్ నుంచి ఇప్పటిదాకా పక్కకు జరగలేదు. ‘అల్లుడు శీను’.. ‘జయ జానకి నాయక’ సినిమాలు ఓ మోస్తరుగా ఆడినప్పటికీ.. అవి శ్రీనివాస్‌కు ఏమాత్రం ఇమేజ్, ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి అంటే సమాధానం చెప్పడం కష్టం. పేరు లేని దర్శకులతో శ్రీనివాస్ సినిమా చేసి.. అది రిలీజైతే కానీ..

అతడి స్టామినా ఏంటో అర్థం కాదు. ఐతే ఇంకా హీరోగా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాకముందే కొంచెం సాహసోపేత సినిమాలు చేయడానికి కుర్రాడు రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్‌తో ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయడానికి ఓకే చెప్పిన శ్రీనివాస్.. దాని కంటే ముందు శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో సినిమా మొదలుపెట్టేశాడు. బెల్లంకొండ బాబు కొత్త దర్శకుడితో సినిమా చేయడమే ఆశ్చర్యమంటే.. ఇది ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని కథ అని.. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ అని చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మాస్ హీరోగా వెలిగిపోవాలని తపించిపోయిన శ్రీనివాస్.. ఆ ప్రయత్నంలో పూర్తిగా విజయవంతం కాకముందే ఇలా యు-టర్న్ తీసుకోవడం షాకింగే. మరి ఈ రిస్క్ అతడికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని నవీన్ అనే కొత్త నిర్మాత ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎప్పట్లాగే ఈ సినిమాకు కూడా బెల్లంకొండ సురేష్ ఫినాన్షియల్ బ్యాకప్ ఉంటుందని సమాచారం.

Related posts:

భారీ షాక్ ఇచ్చిన యంగ్ టైగర్...కుశ ముందు జై-లవ [ఉట్టిదే]
అక్టోబర్ 15: మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రోజు
జులై 27...ఇది నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సునామీ సృష్టించడం ఖాయం
5 వ రోజు రావణుడి భీభత్సం...చుక్కలు చూయించాడు సామి
స్పైడర్@డే 8...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన స్పైడర్
ఏంటయ్యా రామ్ చరణ్...ఏంటి వీర లెవల్ విద్వంసం అసలు??
(5-7) అరాచకం సృష్టించిన || యంగ్ టైగర్ భీభత్సం ఇది ||
ఇదేమి టైటిల్ సామి...టోటల్ టాలీవుడ్ షాక్!!
అదిరింది తెలుగులో హిట్ కావలి అంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా??
8 బంతుల్లో 46 రన్స్ కావాలి...ఆస్టేలియా ఏం చేసిందో తెలుసా??
అక్షరాలా 600 షోలు...పవర్ స్టార్ క్రేజ్ పవర్ ఇది
పెట్టింది 25 కోట్లు...అమ్మింది 12.5 కోట్లు...వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
హలో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
రిలీజ్ కి 2 డేస్ ముందే రిలీజ్...ఏం జరుగుతుందో మరి!!
తరుణ్ "ఇది నా లవ్ స్టొరీ" 8 Days టోటల్ కలెక్షన్స్....దిమ్మతిరిగే షాక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here