190 కోట్ల అసలు లెక్క ఇది…ఆ 2 ఏరియాల్లో ఏం జరుగుతుందో??

0
357

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను సూపర్ పాజిటివ్ టాక్ తో మహేష్ కెరీర్ లో అల్టిమేట్ రికార్డులతో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. కాగా సినిమా ఎంత మంచి రన్ ని కొనసాగిస్తున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు ఇప్పటి వరకు ఎంతవరకు కలెక్షన్స్ ని క్లియర్ గా రాబట్టింది అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కానీ నిర్మాతలు మాత్రం రికార్డ్ లెవల్ కలెక్షన్స్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు.

కాగా రీసెంట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలలోనే 190.63 కోట్ల గ్రాస్ ని అందుకుందని పోస్టర్ ని రిలీజ్ చేశారు. కానీ నైజాం మరియు సీడెడ్ ఏరియాలలో తప్పితే మిగిలిన ఏరియాల కలెక్షన్స్ ఎప్పటి కప్పుడు అప్ డేట్ అవ్వగా ఆ ఏరియాల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రా—33.7 కోట్లు—50  కోట్ల గ్రాస్
కర్ణాటక—7.85 కోట్లు—15 కోట్ల గ్రాస్
రెస్ట్ ఆఫ్ ఇండియా–3.35 కోట్లు—6.5 కోట్ల గ్రాస్
టోటల్—44.9 కోట్లు—71.5 కోట్ల గ్రాస్
మిగిలిన ఏరియాలతో కలిపితే
ఓవర్సీస్—18 కోట్లు —35 కోట్ల గ్రాస్
టోటల్—-62.9 కోట్లు—106.5 కోట్ల గ్రాస్
ఈ లెక్కన సినిమా మిగిలిన 85 కోట్ల గ్రాస్ కి నైజాం మరియు సీడెడ్ ఏరియాల్లో ఎంతవరకు కలెక్షన్స్ ని రియల్ గా సాధించి ఉండవచ్చు అంటూ అందరు గగ్గోలు పెడుతున్నారు. మరి అసలు కలెక్షన్స్ ఎంత అనేది నిర్మాతలకే తెలియాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here