భరత్ అనే నేను రెండో రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
643

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 35 కోట్ల కు పైగా షేర్ ని వసూల్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయగా ఇప్పుడు రెండో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సాధించి షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో అద్బుతమైన కలెక్షన్స్ ని రెండో రోజు సాధించిన భరత్ అనే నేను ఒక్కో ఏరియా కలెక్షన్స్ బయటికి వస్తున్నాయి.

ఉన్న రిపోర్ట్స్ ప్రకారం సినిమా రెండో రోజు మొత్తం మీద 8 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లిమిటెడ్ రిలీజ్ కి ఇది ఊచకోత అనే చెప్పాలి. సినిమా టాక్ కూడా అదిరిపోయే పాజిటివ్ గా ఉండటంతో లాంగ్ రన్ లో….

ఓ రేంజ్ లో కలెక్షన్స్ సునామీ సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వరుసగా రెండు ఫ్లాఫ్స్ పడ్డా కానీ సూపర్ స్టార్ ఈ రేంజ్ లో కంబ్యాక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపే కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here