భరత్ అనే నేను ఓవర్సీస్ రివ్యూ—హిట్టా—ఫట్టా!!

0
1769

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ ల కాంబినేషన్ లో శ్రీమంతుడు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న రెండో సినిమా భరత్ అనే నేను. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా అత్యంత భారీ ఎత్తున ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో సాయంత్రం 6:30 నుండే రిలీజ్ అయిన భరత్ అనే నేను ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండి….

అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యే మహేష్, ప్రజల క్రమశిక్షణా రాహిత్యాన్ని భరించలేక కొన్ని పనులు చేస్తాడు. దాంతో ఒక్కసారిగా అందరిలోనూ అలజడి మొదలు అవ్వడం అందరు మహేష్ ని ప్రశించడం జరుగుతుంది.

దాంతో తన ఉద్దేశ్యం ఏంటి అనేది చెప్పడానికి ట్రై చేసినా అది అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది అందరికీ… కానీ ఒక్కసారి అందరు అర్ధం చేసుకున్నాక మహేష్ ని దేవుడి గా చూస్తారు.

దాంతో అప్పటి నుండి మంచి పనులు చేయడం మొదలు పెట్టిన ముఖ్యమంత్రి కి చాలా మంది శత్రువులు తయారు అవ్వడం, వాళ్ళని ఎదిరించి జనాల కోసం ముఖ్యమంత్రి ఎలాంటి మంచి పనులు చేశాడు అనేది సినిమా కథ.

కథ గా చెప్పడానికి లైన్ చిన్నదే అయినా సినిమా లో చెప్పడానికి సీన్ బై సీన్ అద్బుతంగా పేర్చుకుంటూ దుమ్ము లేపాడు. ఇటు ఫ్యాన్స్ కి మహేష్ నుండి కావాల్సిన సీన్స్ ని కూడా అద్బుతంగా తెరకెక్కించాడు కొరటాల శివ.

ప్రస్తుతం జరుగుతున్న సీరియస్ ఇష్యులను కూడా మంచి సొల్యూషన్ తో చెప్పే ప్రయత్నం ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆకట్టుకున్న స్క్రీన్ ప్లే సూపర్ గా ఆకట్టుకుంటుంది.

ఇక మహేష్ ముఖ్యమంత్రి గా అద్బుతంగా నటించి మెప్పించాగా ఫ్యాన్స్ కోరుకునే సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో, అసెంబ్లీ సీన్ లో అద్బుతంగా నటించి మెప్పించాడట. కియరా అద్వాని తో లవ్ ట్రాక్ కూడా అద్బుతంగా ఉందని అంటున్నారు.

మొదటి సినిమానే అయినా కియరా అద్వాని నటనతో ఆకట్టుకోగా మహేష్ తో పెయిర్ కూడా అద్బుతంగా సెట్ అయింది అని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారని చెబుతున్నారు.

ఇక సంగీతం తో దేవి శ్రీ ప్రసాద్ దుమ్ము దులిపెశాడని, వచ్చాడయ్యో సామి సాంగ్ ఓ రేంజ్ లో గూస్ బంప్స్ తెప్పించేదిగా ఉందని అంటున్నారు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ తో యాక్షన్ సీన్స్ లో ఎలివేషన్ మ్యూజిక్ తో కుమ్మేశాడు అని అంటున్నారు.

ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, లోకేషన్స్, అన్నీ అద్బుతంగా ఉన్నాయని అంటున్నారు. కొరటాల శివ ఎంచుకున్న స్టొరీ కానీ తెరకెక్కించిన విధానం కానీ అన్నీ పెర్ఫెక్ట్ గా ఉన్నాయని అంటున్నారు…సింపుల్ గా చెప్పాలంటే కొరటాల మూవీస్ లో బెస్ట్ అంటుండటం విశేషం.

సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, అసెంబ్లీ సీన్, కియరా తో లవ్ ట్రాక్, సెకెండ్ ఆఫ్ లో యాక్షన్ సీన్స్ ఇలా చాలా ఆకట్టుకునే సీన్స్ ఉన్నాయని అంటున్నారు.

ఇక మైనస్ ల విషయానికి వస్తే ఎంటర్ టైన్మెంట్ సీన్స్ పెద్దగా లేక పోవడం, సెకెండ్ ఆఫ్ లో అక్కడక్కడా స్లో అవ్వడం చిన్న మైనస్ పాయింట్స్ అని అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు.

మొత్తం మీద సినిమా ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో పాటు సామాన్య ప్రేక్షకుల ను కూడా ఆకట్టుకునే అని అంశాలు ఉన్న సినిమా అని అంటున్నారు. ఇక ఇదే టాక్ ని రెగ్యులర్ ఆడియన్స్ నుండి కూడా సొంతం చేసుకుంటే సినిమా అద్బుతమైన విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here