భరత్ అనే నేను కి అల్టిమేట్ రీమేక్ ఆఫర్…హీరో ఎవరో తెలిస్తే షాక్!!

0
408

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వసూళ్ళతో మహేష్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుండగా సినిమా ఇతర రాష్ట్రాల్లో కూడా అద్బుతమైన కలెక్షన్స్ ని సాధిస్తుంది. కాగా సినిమా కి ఇప్పుడు రీమేక్ ఆఫర్స్ కూడా భారీ గా వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

కన్నడ నుండి తమిళ్ నుండి సినిమాకు రీమేక్ ఆఫర్స్ వస్తుండగా తమిళ్ లో పెద్ద నిర్మాతలు ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితులలో రీమేక్ చేస్తే సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఉందని భావిస్తున్నారట.

కాగా ఈ సినిమా లో హీరోగా ఇలయధలపతి విజయ్ ని తీసుకుంటే మరింత రచ్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విజయ్ తర్వాత మూవీ ఇప్పటి వరకు కమిట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఈ రీమేక్ ని కనుక ఓకే చేసి విజయ్ తో చేస్తే తమిళ్ ఇండస్ట్రీ షేక్ అయ్యే రికార్డులు నమోదు అవుతాయి అంటున్నారు. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here