భరత్ అనే నేను జెన్యూన్ రివ్యూ…సూటిగా సుత్తిలేకుండా!!

0
2160

          ఎప్పుడెప్పుడా అని సూపర్ స్టార్ అభిమానులే కాకుండా టోటల్ టాలీవుడ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా భరత్ అనే నేను… అత్యంత భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చేసిన ఈ సినిమా ఓవర్సీస్ నుండి ఇప్పటికే మంచి టాక్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ షోల ని పూర్తీ చేసుకుని అసలు సిసలు పబ్లిక్ టాక్ ని కూడా సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇక సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ…విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చిన హీరో అనుకోకుండా ముఖ్యమంత్రి అవ్వాల్సి వస్తుంది. కానీ అసలు రాజకీయాల గురించి తెలియని వ్యక్తీ ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు వాటిని ఎలా ఎదిరించి ప్రజలకు మేలు చేశాడు అన్నది కథ.

స్టొరీ లైన్ పరంగా సింపుల్ గా చెప్పాలి అంటే…అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యి మొదట్లో కొన్ని నిర్ణయాలతో అందరికీ కొంత భయం పుట్టించినా తర్వాత తన మంచితనంతో అందరి మెప్పు పొంది జనాలకు మంచి చేస్తాడు హీరో.

ఇలాంటి కథని ఎంచుకున్నందుకు ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ రాజకీయ నాయకుడిని గుర్తు చేయకుండా జనాలను థియేటర్స్ కి వచ్చాక భరత్ ప్రపంచంలో రప్పించి మూడు గంటల పాటు అతని లైఫ్ లో మనం ట్రావెల్ చేసేలా చేశాడు కొరటాల.

ఇలాంటి కథని ఒప్పుకున్నా మహేష్ ని కూడా మెచ్చుకోవాల్సిందే,తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఈ సినిమా లో ఇచ్చేలా తన నటనతో మెప్పించాడు మహేష్. అదే సమయంలో ఫ్యాన్స్ తన నుండి కోరుకునే అన్ని అంశాలను కూడా సినిమా లో ఉండేలా చూసుకున్నాడు.

హీరోయిన్ కీయరా అద్వాని ఫస్ట్ తెలుగు సినిమా నే అయినా మంచి నటనని కనబరిచింది, మహేష్ పక్కన బాగా సెట్ అయింది, మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తమ తమ పనులను అద్బుతంగా నిర్వర్తించారని చెప్పొచ్చు.

వారిలో అందరి కన్నా ఎక్కువ మార్కులు దేవి శ్రీ ప్రసాద్ కి దక్కుతాయి. సంగీతం కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ అద్బుతంగా సెట్ అయ్యాయి, ఇక ఆర్ట్ డైరెక్టర్ పని తీరు కూడా శెభాష్ అనిపించేదిగా ఉంటుంది. సినిమా చాలా రిచ్ గా ఉంటుందని చెప్పొచ్చు.

సినిమాలో మెయిన్ హైలెట్స్ విషయానికి వస్తే మహేష్-కీయరా లవ్ ట్రాక్, రెండు ప్రెస్ మీట్స్, అసెంబ్లీ సీన్, అన్ని ఫైట్ సీన్స్ మరియు మహేష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అదే సమయంలో మైనస్ ల విషయానికి వస్తే…..

కథ కొంచం పొడవుగా ఉండటం, సెకెండ్ ఆఫ్ లో కొద్దిగా స్లో అవ్వడం అనే చిన్న మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. ఓవరాల్ గా భరత్ అనే నేను అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమా..ఫ్యాన్స్ కి విందు భోజనం లాంటి సినిమా అని చెప్పొచ్చు.

123జోష్ రేటింగ్—3.5/5
రెండు ఫ్లాఫ్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు అల్టిమేట్ కంబ్యాక్ మూవీ భరత్ అనే నేను…బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ రియల్ పవర్ ఏంటో చూపెట్టే సినిమా భరత్ అనే నేను…ఇందులో ఎలాంటి డౌట్ లేదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here