చెప్పి మరీ కొట్టిన బాబీ…ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి 2 ప్రామిస్ లు ఇచ్చేశాడు

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర 80 కోట్ల తో భీభత్సం సృష్టిస్తుండగా సినిమా GST వల్ల భారీ ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నా మొత్తం మీద సెమీ హిట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. కాగా ఈ సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ బాబీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఓ రెండు ప్రామిస్ లు చేశాడు ఇప్పుడు ఆ రెండు ప్రామిస్ లు నిజం చేసుకున్నాడు అని చెప్పొచ్చు.

మొదటిది జై పాత్ర అల్టిమేట్ లెవల్ లో మాస్ ఎలిమెంట్స్ తో పూనకాలు తెప్పించే విధంగా ఉంటాయని చెప్పాగా సినిమా రిలీజ్ రోజు నుండి ఇప్పటి వరకు జై పాత్ర హ్యాంగోవర్ లో చాలా మంది ఉండటం బాబీ మొదటి ప్రామిస్ ని నిజం చేసుకోవడం జరిగింది.

ఇక రెండోది ఈ ఏడాది కచ్చితంగా ఈ సినిమా టాప్ 3 గ్రాసర్స్ లో ఒకటిగా నిలుస్తుంది అని చెప్పగా బాహుబలి మరియు ఖైదీనంబర్ 150 ల తర్వాత ప్లేస్ లో జైలవకుశ నిలవడం తో రెండు ప్రామిస్ లను పూర్తి చేసుకోవడం తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయిందని చెప్పొచ్చు.

Leave a Comment