బాబీ ఇది కనుక గెలిస్తే రచ్చ రంబోలా

గోస్ట్ రైటర్ గా అనేక సినిమాలకు పనిచేసి….దర్శకుడిగా రవితేజ తో పవర్ సినిమా తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రవీంద్ర(బాబీ)…తరువాత వెంటనే పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ చేసే చాన్స్ దక్కించుకున్నాడు…ఆ సినిమా ఫ్లాఫ్ లో తాను పెద్దగా భాద్యత కాకున్నా అందరు ఫ్లాఫ్ డైరెక్టర్ గా బాబీని చూడటం మొదలు పెట్టిన వేల మూడు వరుస విజయాల తో ఫాం లో ఉన్న….

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జైలవకుష లాంటి వైవిధ్యభరితమైన సినిమా చేసే అద్బుత అవకాశాన్ని సొంతం చేసుకున్న బాబీ ఈ సినిమా ను ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం చేశాడు…సెప్టెంబర్ 21 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

సినిమా కనుక అనుకున్న అంచనాలను అందుకుంటే బాబీ కి ఇండస్ట్రీ లో అల్టిమేట్ ఫ్యూచర్ ఉంటుంది అనేది విశ్లేషకుల వాదన….ఇప్పటికే అల్లుఅర్జున్-రామ్ చరణ్ లు బాబీ జైలవకుష ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు..మరి బాబీ చేయాల్సిందల్ల జైలవకుష ను గెలిపిస్తే ఇక రచ్చ రంబోలా అంటున్నారు విశ్లేషకులు…

Leave a Comment