చల్ మోహన్ రంగ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా—ఫట్టా!!

0
380

యంగ్ హీరోలలో మోస్ట్ లక్కీ హీరో ఎవరు అంటే నితిన్ అనే చెప్పాలి…కెరీర్ మొదట్లో తప్పితే మధ్యలో వరుస ఫ్లాఫ్స్ ఉన్నా కానీ దాదాపు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అందరితోనూ పనిచేసిన ఘనత నితిన్ కే చెల్లుతుంది. కొంత గ్యాప్ తర్వాత ఇష్క్ తో కంబ్యాక్ చేసి స్టడీగా సినిమాలు చేస్తున్న నితిన్ అ..ఆ తో మంచి విజయం అందుకున్నాడు. కానీ తర్వాత లై బిగ్గెస్ట్ ఫ్లాఫ్ అవ్వడంతో ఇప్పుడు ఆశలన్నీ చల్ మోహన్ రంగ మీదే పెట్టుకున్నాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ లో సుమారు 130 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ అయ్యింది. మరి సినిమా కి అక్కడ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…సినిమా కథ ఏమి సరికొత్త కథ ఏమి కాదట.

ఒక ప్రయాణం లో కలిసే ఒక యువజంట ప్రేమలో ఎలా పడ్డారు వారి మధ్య వచ్చిన అడ్డంకులు తిరిగి ఎలా ఏకం అయ్యారు అనే సింగిల్ లైన్ స్టొరీ తో తెరకెక్కిన చల్ మోహన్ రంగ సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఓ రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు.

కామెడీ నే ఎక్కువగా నమ్ముకున్న నితిన్ సినిమాలో చాలా వరకు ఎంటర్ టైనమెంట్ ఉండేలా చూసుకుని సేఫ్ గేం ఆడాడట. త్రివిక్రమ్ అందించిన కథ కూడా మరీ కొత్తది కాకుండా చాలా వరకు సీన్స్ ని ఎంగేజింగ్ గాను ఎంటర్ టైన్మెంట్ తో ఉండేలా చూసుకున్నాడట.

దాంతో సినిమా లెంగ్ రెండున్నర గంటలు ఉన్నా కానీ పెద్దగా బోర్ కొట్టే అవకాశం లేకుండా మంచి సీన్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తు పోతూ ఉంటాయని అంటున్నారు. చాలా వరకు సీన్స్ ప్రేక్షకులను అలరించేవిగా ఉండటం ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.

ఇక తమన్ అందించిన పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోగా హీరోయిన్ మేగ అక్ష ఆకట్టుకుందని, కామెడీ నటినటులు అందరు నవ్వించారని అంటున్నారు, సాంకేతిక నిపుణులు కూడా మంచి వర్క్ ఈ సినిమా కోసం చేశారని అంటున్నారు.

నితిన్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమానే అయినా కొత్తగా కాకుండా మంచి ఎంటర్ టైనమెంట్ తో సేఫ్ గేం ఆడి ఆల్ మోస్ట్ గెలిచాడు అంటున్నారు. సెకెండ్ ఆఫ్ కొద్దిగా స్లో అయినా సినిమా మొత్తం మీద అంచనాలను అందుకుంది అంటుండటం విశేషం.

త్రివిక్రమ్ అందించిన కథని నితిన్ మరియు పవన్ కళ్యాణ్ సంయుక్త౦గా నిర్మించగా కృష్ణచైతన్య అనే కొత్త డైరెక్టర్ సినిమాను ప్రేక్షకులను అలరించే విధంగా తీర్చిదిద్దడంలో చాలా వరకు సఫలం అయ్యాడు అని అంటున్నారు.

ఓవర్సీస్ నుండి మంచి టాక్ ని దక్కించుకున్న ఈ సినిమా ఓవరాల్ గా చూసుకుంటే హిట్ కల కనిపిస్తుంది అని చెప్పొచ్చు. మరి రెగ్యులర్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందా అని ఇప్పుడు అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here