చల్ మోహన్ రంగ జెన్యూన్ రివ్యూ…కొట్టాడు కానీ!!

0
371

   కెరీర్ లో అనేక ఎదురుదెబ్బలు తిన్నా తిరిగి కంబ్యాక్ ని సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోలలో యంగ్ హిరో నితిన్ కూడా ఒకరు. ఇష్క్ తో ఒకసారి అ..ఆ సినిమాతో మరోసారి నికార్సయిన హిట్స్ కొట్టిన నితిన్ కి అ..ఆ తర్వాత వెంటనే లై తో దిమ్మతిరిగే షాక్ తగిలింది. దాంతో ఇప్పుడు తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా చల్ మోహన్ రంగ తో కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు.

మరి సినిమా ఎలా ఉందంటే….మూడు సార్లు అమెరిక విసా కోసం ప్రయత్నించి విఫలం అయిన హీరో నాలుగో సారి లక్కీగా పాస్ అవుతాడు. వెంటనే పెద్దపులి సాంగ్ తో రాఫ్ఫాడించి అమెరికా వెళ్ళగా అక్కడ హీరోయిన్ తో పరిచయం ప్రేమగా మారడం జరుగుతంది.

మరి ఆ ప్రేమని ఎలా పొందాడు అనేది సినిమా కథ. ఈ కథని అందించింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్….డైరెక్షన్ చేసింది కృష్ణచైతన్య అనే కొత్త దర్శకుడు.. డైరెక్టర్ వేరే వారే అయినా కానీ సీన్ సీన్ కి త్రివిక్రమ్ మార్క్ పంచులు కనిపించడం డైరెక్షన్ త్రివిక్రమ్ చేశాడా అనిపించడం ఈ సినిమా స్పెషాలిటీ.

రొటీన్ కథనే అయినా సినిమా లో ఎంటర్ టైన్మెంట్ ఎక్కువగా ఉండటం కలిసి వచ్చింది, ఫస్టాఫ్ తో పాటు సెకెండ్ ఆఫ్ కూడా మేజర్ పార్ట్ ఎంటర్ టైన్మెంట్ సీన్స్ తో అలరిస్తుంది. దానికి తమన్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ ని బట్టి అద్బుతంగా ఇచ్చాడు తమన్.

రొటీన్ కథని తన కెరీర్ లో 25 వ సినిమాకి ఎంచుకోవడం కొద్దిగా షాకింగ్ అనిపించినా సేఫ్ గేం ఆడిన నితిన్ ఆల్ మోస్ట్ సక్సెస్ కూడా అయ్యాడు. తన నటనతో ఆకట్టుకుని మెప్పించి మంచి ఎంటర్ టైనర్ ని ప్రేక్షకులకు అందించేలా అన్ని ఉండేలా చూసుకున్నాడు.

హీరోయిన్ మెగా అక్ష పర్వాలేదు అనిపించుకోగా మిగిలిన నటీనటులు అందరు ఆకట్టుకున్నారు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఫస్టాఫ్ అమెరికాలో సెకెండ్ ఆఫ్ ఊటి లోకేషన్స్ లో తెరకెక్కించారు. ఓవరాల్ గా నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఈ మధ్యకాలంలో మంచి ఎంటర్ టైన్మెంట్ సినిమాలు రాలేదు కాబట్టి చల్ మోహన్ రంగ సినిమాకి అది చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. సినిమా కూడా చాలా వరకు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే విధంగా ఉండటంతో కచ్చితంగా ఇలాంటి సినిమాలను చూడాలి అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

ఈ సినిమాకి ఓవరాల్ గా 123జోష్ ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…రొటీన్ కథనే అయినా అలరించేలా తెరకెక్కించి రెండున్నర గంటలు ఆద్యంతం ఎంటర్ టైన్ చేసిన చల్ మోహన్ రంగ నితిన్ కి మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here