ఛలో మూవీ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా–ఫట్టా!!

0
697

         యంగ్ హీరోలలో వరుసగా మొదటి సినిమాలతో హిట్లు కొట్టిన హీరోలలో నాగశౌర్య కూడా ఒకరు…కెరీర్ మొదట్లోనే లెక్కలు మిక్కిలి వచ్చిన ఆఫర్స్ అన్నింటిని ఒప్పేసుకున్న నాగశౌర్య తర్వాత రెండు మూడు వరుస ఫ్లాఫ్స్ ని తన ఖాతాలో వేసుకోగా కొంత గ్యాప్ తీసుకుని తన ఓన్ ప్రొడక్షన్ లో ఛలో అంటూ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి ఈ సినిమాతో నాగశౌర్య తిరిగి కంబ్యాక్ చేశాడా లేదా చూద్దాం పదండి…

సాయంత్రం 6 నుండే ఈస్ట్ కంట్రీస్ లో సుమారు 100 లోకేషన్స్ నుండి ప్రీమియర్ షోల తో రిలీజ్ అయిన ఛలో సినిమా అక్కడ నుండి మంచి టాక్ నే సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు, యూనిట్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీసర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ తో పాటు సినిమాలో హైలెట్స్ చాలా ఉన్నాయని అంటున్నారు.

తెలుగు తమిళ్ భాషల నడుమ హీరో పడే పాట్లు…హీరోయిన్ రష్మిక తో హీరో ప్రేమ ఎలా సఫలం అయ్యింది అనేది మెయిన్ థీం అయినా దర్శకుడు సినిమా హ్యాండిల్ చేసిన విధానం మొదటి సీన్ నుండి చివరి వరకు ప్రేక్షకుల ముఖాల పై చిరునవ్వు చేరదనివ్వకుండా చేసిందని అంటున్నారు.

సినిమా కథ మొదలు అవ్వడం నుండి చివరి వరకు కథ చెబుతూనే మంచి కామెడీ సీన్స్ తో ఆద్యంతం మంచి ఎంటర్ టైనర్ ని తెరకెక్కించాడని దర్శకుడు వెంకీ కొడుములని మెచ్చుకుంటున్నారు చూసిన ఆడియన్స్..ముఖ్యంగా కామెడీ సీన్స్ సినిమాలో ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేశాయి అంటున్నారు.

హీరో ఎంట్రీ నుండి హీరోయిన్ తో లవ్ సీన్స్ ఆ తర్వాత వరుసగా కామెడీ ఎపిసోడ్స్ తో ఫస్టాఫ్ అంతా ఎంటర్ టైనర్ గా ఉండగా ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అద్బుతంగా పేలింది అంటున్నారు…సెకెండ్ ఆఫ్ అదే రేంజ్ లో కొనసాగినా కొంచం ఫ్లో మిస్ అయిన ఫీలింగ్ కలిగిందని అంటున్నారు.

సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు…హీరోయిన్ రష్మిక ఫ్రెష్ లుక్స్ అందరినీ ఆకట్టుకుందని…నాగశౌర్య తో సమానంగా మార్కులు దక్కించుకుందని అంటున్నారు. ఇక సినిమాకు సంగీతం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు.

పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్, లవ్ బ్రేకప్ సాంగ్ ఇలా అన్నీ అద్బుతంగా సెట్ అయ్యాయని.. .అంటున్నారు… ఎడిటింగ్ పెర్ఫెక్ట్ గా సెట్ అయిందని..దర్శకుడు వెంకీ కొడుముల తొలి సినిమాతో మరో శ్రీనువైట్ల తొలినాళ్ళతో రెచ్చిపోయిన రేంజ్ లో ఆకట్టుకున్నాడని అంటున్నారు.

ఓవరాల్ గా సినిమాలో మైనస్ లు ఫస్టాఫ్ లో కథని వెంటనే మొదలు పెట్టకుండా ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ తో కాలక్షేపం చేయడం ఒక్కటే చిన్న మైనర్ మైనస్ అని అంటున్నారు…అది తప్పితే సినిమాలో ప్లస్ పాయింట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు.

2018 లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో యునానిమస్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తుండటంతో ఇక్కడ రెగ్యులర్ షోల కి కూడా ఇదే టాక్ ని కొనసాగిస్తే కచ్చితంగా ఛలో అద్బుతమైన కలక్షన్స్ ని సాధించే సినిమా అవుతుందని చెప్పొచ్చు….మరి ఇక్కడ ఎలాంటి టాక్ ని తెచ్చుకుంటుందో చూడాలి…

Related posts:

జయ జానకి నాయక ఫస్ట్ రివ్యూ...హిట్టా-ఫట్టా
50 ఇన్ 85....ఇదీ ట్రూ బ్లాక్ బస్టర్...అంటే
అక్షరాల 18 కోట్లు...యంగ్ టైగర్ చరిత్ర సృష్టించాడు
ఆ రోల్ టాలీవుడ్ లో చేయగలిగేది ఎన్టీఆర్ ఒక్కడే అంటున్న డైరెక్టర్
కంచుకోటలో ఎన్టీఆర్ భీభత్సం...400 తో ఇండస్ట్రీ రికార్డ్
85 ఏళ్ల తెలుగు సినిమా చరిత్ర తిరగరాసిన రామ్ చరణ్ సినిమా!!
పవర్ స్టార్ రేంజ్ చూసి మీసం మేలేస్తున్న మెగా ఫ్యాన్స్!!
118...100...ఇక పవర్ భీభత్సాన్ని ఆపలేం అసలు!
కళ్యాణ్ రామ్ న్యూ మూవీ టైటిల్ ఎన్టీఆర్ చేతుల మీదుగా??
అజ్ఞాతవాసి మూవీ రివ్యూ...పవర్ స్టార్ పవర్(ఊహాతీతం)...సెన్సేషనల్ బ్లాక్ బస్టర్
పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు...ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!!
ఆల్ మోస్ట్ అఫీషియల్ న్యూస్...ఈయన అవుట్...ఆయన ఇన్!!
చస్...రికార్డ్ కొట్టిన తొలిప్రేమ...5 రోజుల్లో అల్టిమేట్ ఫీట్!!
నాని అ! మూవీ ప్రేమీయర్ షో రివ్యూ....హిట్టా ఫట్టా!!
రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్...అది కూడా GST లో...ఊచకోత!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here