ఛలో మూవీ రివ్యూ….సూటిగా సుత్తి లేకుండా!!

0
1121

         చూసి చూడంగానే అంటూ ఒక్క పాట రిలీజ్ చేసి సినిమాపై హైప్ ని పెంచి ఆ తర్వాత మంచి టీసర్ ను దాన్ని మరిపించే ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను రోజు రోజుకి పెరిగేలా చేసుకున్న హీరో నాగశౌర్య…మంచి కథ దొరకడం వలన తానె నిర్మాతగా మారి సినిమా తీశానని చెబుతున్న నాగశౌర్య నిర్మాణం లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఛలో ఈ రోజు మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యింది.

సినిమా ఎలా ఉందొ సూటిగా సుత్తి లేకుండా తెలుసుకుందాం పదండీ….హీరో ఎప్పుడు కొట్లాటకి వెళుతున్నాడు అని హీరో ఫాదర్ అతన్ని ఆంధ్రప్రదేశ్-తమిళనాడు బార్డర్ లో గల కాలేజ్ కి పంపిస్తాడు…అక్కడ తెలుగు తమిళ్ భాషల నడుమ గొడవ హీరోయిన్ తో ప్రేమ…..

ఎలాంటి పరిస్థితుల కి దారి తీసింది అనేది సినిమా కథ….కథ గా చెప్పుకోవడానికి పెద్దగా లేకున్నా స్క్రీన్ ప్లే తో మంచి ఎంటర్ టైన్ మెంట్ కూడుకున్న సీన్స్ తో దర్శకుడు సినిమాను మొదటి అర్ధభాగం వరకు ఎలాంటి వంక పెట్టకుండా నడిపి ఫుల్ మార్కులు కొట్టేశాడు.

కానీ సెకెండ్ ఆఫ్ లో ట్రీట్ మెంట్ విషయం లో కొన్ని తప్పటడుగులు వేయడం మరీ ముఖ్యంగా క్లైమాక్స్ తేలిపోవడం సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్…సెకెండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే మరింత జాగ్రత్త పడి ఉంటె సినిమా రేంజ్ మరో విధంగా ఉండేదని చెప్పొచ్చు.

కానీ ఉన్నంతలో సత్య మరియు వెన్నెల కిషోర్ ల కామెడి సెకెండ్ ఆఫ్ ని నిలబెట్టింది అని చెప్పొచ్చు. ఆ కామెడి పుణ్యమే వీక్ క్లైమాక్స్ ని కూడా మరిపించి మంచి సినిమా చూశాం అన్న భావన ని కలిగించింది అని చెప్పొచ్చు.

నాగశౌర్య తన పాత్ర వరకు అద్బుతంగా నటించి మెప్పించాడు…హీరోయిన్ రష్మిక మొదటి సినిమాతోనే ఫుల్ మార్కులు కొట్టేసింది…ఇద్దరి జంట ఫ్రెష్ గా క్యూట్ గా ఉంది… ఫస్టాఫ్ లో వచ్చే కామెడి సీన్స్ అద్బుతంగా పేలాయి అని చెప్పొచ్చు.

సత్య వెన్నెల కిషోర్ లు కామెడీ భాద్యతని మోశారు…వైవ హర్ష కూడా తనవంతుగా ఓ చేయి చేయగా సినిమా లో ఎక్కువ శాతం ఎంటర్ టైన్ మెంట్ తో నిండిపోయింది… ఇక సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సంగీతం అని చెప్పొచ్చు.

ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అయిన చూసి చూడంగానే సాంగ్ విజువల్ గాను అదిరిపోయింది…ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదుర్స్ అనిపించుకున్నాడు…మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ పని సక్రమంగా నిర్వర్తించారు.

దర్శకుడు వెంకీ కొడుముల కొత్త కథ చెప్పకున్నా రొటీన్ కాలేజ్ కథని ఎంటర్ టైన్ మెంట్ వె లో చెప్పి చాలా వరకు మెప్పించాడు…సెకెండ్ ఆఫ్ లో ఫ్లాట్ సీన్స్ అలాగే వీక్ క్లైమాక్స్ ని మరింత జాగ్రత్త గా డీల్ చేసి ఉంటె సినిమా రేంజ్ మరో లెవల్ లో ఉండేది.

కానీ తనకున్న వనరులను అద్బుతంగా వాడుకుని మంచి ఎంటర్ టైన్ మెంట్ ని అందించి మెప్పించాడు. సినిమా ఓవరాల్ గా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో పాటు కాలేజి స్టూడెంట్స్ ని కూడా ఆకట్టుకోవడం ఖాయం అని చెప్పొచ్చు. ఈ వీకెండ్ కి ఇదే బెస్ట్ సినిమా అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది.

Related posts:

పైసావసూల్ ట్రైలర్..[అరాచకం] సృష్టించిన బాలయ్య...కానీ ఇదేంటి!!
మహేష్ 3,00,000 ఇండస్ట్రీ రికార్డ్ కొట్టే హీరో ఎవరు?
టోటల్ వరల్డ్ వైడ్ గా పైసావసూల్ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసా??
మెగా పవర్ స్టార్ అడుగుపెడుతున్నాడు...ఈ సినిమా జాతకం మారుతుందా
వీళ్ళెం ఫ్యాన్స్ అండీ బాబు... 15 నిమిషాల్లో ప్రపంచవ్యాప్త భీభత్సం ఇది
మహేష్ స్పైడర్ 6 వ రోజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
#ఎన్టీఆర్28...ఈవెంట్ జరిగేది ఇక్కడే...కొద్ది సేపట్లో భీభత్సం
నందమూరి ఫ్యాన్స్ మీసం మేలేసేలా చేసిన "జైసింహా"...పూనకాలే ఇక
2016 మాత్రం యునానిమస్....ఎన్టీఆర్ పవర్ ఇది
బ్రేకింగ్ న్యూస్...ఈ రోజు అజ్ఞాతవాసి టీసర్ రిలీజ్ (టైం) ఇదే !!
నైజాం+శాటిలైట్....ఎన్టీఆర్ భీభత్సం ఇది
జై సింహా ఫస్ట్ డే కలెక్షన్స్...కుమ్మేసిన నట సింహా
30 కోట్ల టార్గెట్....70 కోట్లు కొట్టిన నాని...హ్యుమంగస్
ఇది నా లవ్ స్టొరీ...ఫైనల్ టాక్...హిట్టా ఫట్టా!!
తరుణ్ "ఇది నా లవ్ స్టొరీ" 8 Days టోటల్ కలెక్షన్స్....దిమ్మతిరిగే షాక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here