రామ్ చరణ్ సినిమాకు అరుదైన గౌరవం…ఫ్యాన్స్ కి పూనకాలే

0
3086

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు….నటుడిగా రామ్ చరణ్ కి మంచి పేరుని కూడా తీసుకొచ్చింది.

కాగా రీసెంట్ గా హిందీలో డబ్ అయిన ఈ సినిమాకు ఏ తెలుగు డబ్బింగ్ సినిమాకి దక్కని గౌరవం లభించింది అని చెప్పొచ్చు. బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజయ్ దేవగన్ ఈ సినిమాలో రామ్ చరణ్ వాయిస్ కి హిందీ డబ్బింగ్ చెప్పారు.

ఇక అరవింద్ స్వామి రోల్ కి సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ డబ్బింగ్ చెప్పడంతో హిందీ వర్షన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దాంతో డబ్బింగ్ సినిమాల్లో ఇలాంటి గౌరవం దక్కించుకున్న రేర్ సినిమాగా రికార్డు నెలకొల్పగా అది రామ్ చరణ్ సినిమాకి దక్కడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here