కేక పెట్టించే కాంబో…మగధీర రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం

0
1304

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కెరీర్ తొలి నాళ్ళ లోనే మగధీర లాంటి లైఫ్ టైం మూవీ పడటం అద్బుతమనే చెప్పాలి…కానీ తర్వాత తన పై పెరిగిన హ్యుమంగస్ అంచనాలను సరిగ్గా అందుకోలేక పోతున్న రామ్ చరణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మగధీర లాంటి మ్యాజికల్ మూవీ ని సొంతం చేసుకోలేక పోతున్నాడు.

ఇలాంటి సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు ధృవ-రంగస్థలం 1985 లాంటి సినిమాలతో చేరువ అవుతున్న రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు…కానీ ఆ సినిమాతో పాటే మరో బంపర్ మూవీ ని రామ్ చరణ్ చేసే ఆలోచన లో ఉన్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ ఊరమాస్ మూవీ చేయబోతున్నాడ ట. ప్రస్తుతం కథా చర్చలు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని అంటున్నారు. మరి అన్నీ ఓకే అయితే కొరటాల సినిమాతో సమానంగా ఈ సినిమా ఉంటుందా లేక తర్వాత ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here