కెరీర్ బెస్ట్ ని మూడు రోజుల్లో మహేష్ లేపుతాడట!!

0
483

రెండున్నరేళ్లుగా యుఎస్ లో తెలుగు సినిమాల వసూళ్లలో నాన్-బాహుబలి రికార్డు ‘శ్రీమంతుడు’ పేరిటే నిలిచి ఉంది. దాన్ని ‘రంగస్థలం’ ఇటీవలే అధిగమించింది. ‘శ్రీమంతుడు’ 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే రెండో వీకెండ్లోనే దాన్ని దాటేసింది ‘రంగస్థలం’. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ 3.5 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువగా ఉందీ చిత్రం. ఐతే ఈ రికార్డు ఇంకెంతో కాలం నిలిచి ఉండే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. రికార్డు సాధించిన రెండు వారాలకే అది బద్దలయ్యేలా కనిపిస్తోంది.

భారీ అంచనాల మధ్య వచ్చే వారాంతంలో విడుదలవుతున్న మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’ ఈ రికార్డును నిలవనిచ్చేలా కనిపించడం లేదు.యుఎస్ లో దాదాపు 400 లొకేషన్లలో ఏకంగా 2 వేల ప్రిమియర్ షోలు ప్లాన్ చేశారు ‘భరత్ అనే నేను’ సినిమాకు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా చాలు ప్రిమియర్లతోనే 1.5-2 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్లో వసూళ్ల మోత మోగిపోతుంది. వారాంతం మొత్తంలో 10 వేల షోలు అంటున్నారంటే అవన్నీ ఫుల్స్ అయ్యాయంటే వసూళ్లు ఊహకందని విధంగా ఉంటాయి. వీకెండ్లోనే ‘రంగస్థలం’ రికార్డు ఈజీగా బద్దలైపోతుంది. ఫుల్ రన్లో 5 మిలియన్ డాలర్ల మార్కును కూడా ఈ చిత్రం అందుకునే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here