చరిత్రకెక్కిన అల్లుఅర్జున్…సౌత్ మొత్తం మీద ఏ హీరో కి లేని చారిత్రక రికార్డ్

0
273

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పేరిట మరో హిస్టారికల్ ఆల్ టైం రికార్డ్ వచ్చి చేరింది. తన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో యావరేజ్ టాక్ తోనూ సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపగా టోటల్ రన్ లో ఎవ్వరూ ఊహించని కలెక్షన్ల వర్షం కురిపించింది.

టోటల్ రన్ లో ఈ సినిమా 72.1 కోట్ల షేర్ ని 121 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టి అల్లుఅర్జున్ కెరీర్ లో వరుసగా రెండవ 70 కోట్ల సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది. ఇలాంటి రికార్డ్ సౌత్ మొత్తం మీద మరే హీరో కి కూడా లేదనే చెప్పాలి. 

వరుసగా రేసుగుర్రం నుండి దువ్వాడ జగన్నాథం వరకు 5 వరుస 50 కోట్ల సినిమాలతో చారిత్రిక రికార్డును నెలకొల్పాడు అల్లుఅర్జున్…ఈ రికార్డ్ కూడా మరే సౌత్ హీరో కెరీర్ లో లేకపోవడం అల్టిమేట్ రికార్డ్ అని చెప్పాలి. ఇలాంటి అల్టిమేట్ రికార్డులతో దుమ్ము లేపుతున్న అల్లుఅర్జున్ 2018 లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తో మరింత రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here