చస్….ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ఉత్తమ పురస్కారం…

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి 2015 నుండి అన్ని సినిమాలు అద్బుతంగా కలిసి వచ్చాయి అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాలన్నీ ఒక్కో సినిమాతో ఒక్కో రికార్డులు నెలకొల్పుతూ దూసుకు పోయాడు ఎన్టీఆర్. ఇక 2016 ఇయర్ లో అయితే బెస్ట్ మూవీస్ తో దుమ్ము లేపి హీరో ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు… ఇప్పుడు 2017 ఇయర్ లో కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్….

జైలవకుశ సినిమాతో తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ సినిమా కి గాను ఇప్పుడు ఉత్తమ నటుడు పురస్కారం సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా 91.5 రేడియో ఎఫ్.ఎం వారు రిలీజ్ చేసిన 2017 ఇయర్ అవార్డులలో ఎన్టీఆర్ కి ఉత్తమ నటుడు అవార్డ్ దక్కింది.

దాంతో 2017 ఇయర్ కి గాను మొదటి అవార్డ్ అందుకున్న ఆనందంలో ఉన్న ఎన్టీఆర్…ఇదే జోరు ని మున్ముందు కూడా కొనసాగించే అవకాశం ఉందని చెప్పొచ్చు…ఎందుకంటే ఇంకా నికార్సయిన అవార్డుల సీజన్ మొదలు కాలేదు…ఒక్కసారి మొదలు అయితే ఎన్టీఆర్ కి మరిన్ని అవార్డులు రావడం పక్కా అని అంటున్నారు.

Leave a Comment