చస్….ఎన్టీఆర్ కోసం ఏకంగా హాలీవుడ్ బ్యాచ్!!

  నాన్న జీవిత కథను తెరకెక్కించే లక్ష్యంతో నందమూరి బాలకృష్ణ సాయి కొర్రపాటి నిర్మాణ భాగస్వామ్యంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇందుకోసం హాలీవుడ్ టీంని ఒకటి స్పెషల్ గా తీసుకొచ్చారట. సినిమాలో దాదాపు 70 పాత్రలు ఉన్న నేపధ్యంలో ప్రతి దానికి ఒక స్కెచ్ రూపొందించి దానికి సరిపడా నటులను సెట్ చేసే బాధ్యత ఇది చూసుకుంటుంది.

ఒకవేళ సెలెక్ట్ చేసుకున్న నటులు పర్ఫెక్ట్ గా మ్యాచ్ కాకపోతే అందుకు అనుగుణంగా మేకప్ చేసి మార్పులు చేసే విధంగా వీళ్ళే గైడ్ లైన్స్ కూడా ఇస్తారట. ఎన్టీఆర్ జీవితంలో ఆయనతో అనుబంధం ఉన్న కీలక వ్యక్తులందరినీ చూపించే విధంగా స్క్రిప్ట్ ని చాలా పక్కగా ప్లాన్ చేసారట. దీనితో పాటు మరో టీం ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన మరికొంత కీలక సమాచారం వెతికే పనిలో తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతోందని తెలిసింది. ఆయనకు పరిచయమున్న వ్యక్తులను కలుస్తూ – ప్రదేశాలన్ని తిరుగుతూ సినిమాకు ఉపయోగపడే వాటిని నమోదు చేసుకుంటున్నారు.

ఇప్పుడు నటీనటుల సెలక్షన్ కూడా పెద్ద ఛాలెంజ్ గా మారనుంది. అధిక శాతం ఆర్టిస్టులు కావాల్సిన నేపధ్యంలో దీనికి పెద్ద కసరత్తే జరుగుతోంది. యాభై ఏళ్ళ వెనక్కు కాలాన్ని ప్రతిబింబించేలా బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకోవాలి కాబట్టి బడ్జెట్ కూడా భారీగానే అవసరం అయ్యేలా ఉంది. ఎన్టీఆర్ పాత్రకు భార్య బసవతారకం పాత్రలో ఎవరు నటిస్తారు అనే దాని గురించి కూడా తేజ ఆప్షన్స్ వెతికే పనిలో ఉన్నాడు. ఇవన్ని కొలిక్కి వచ్చేలోపు కాస్త సమయం పడుతుంది కాబట్టి బాలయ్య అంత వరకు రెస్ట్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు టాక్. మరికొందరు దర్శకులు లైన్ లో ఉన్నా పూర్తిగా ఎన్టీఆర్ సినిమా మీద దృష్టి కేంద్రీకరించాలని డిసైడ్ అయ్యారట.

Leave a Comment