9 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా…ఇప్పుడు చెబుతున్నా!!!

0
4045

టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో మగధీర కూడా ఒకటని చెప్పొచ్చు. 2009 లో అత్యంత భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెగా మమ్మోత్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఇలాంటి చారిత్రిక హిట్ తర్వాత ఆ ఇంపాక్ట్ రామ్ చరణ్ కెరీర్ పై ఎంతలా పడింది అంటే ప్రతీ సినిమాను మగధీరతో కంపేర్ చేయడం మొదలు పెట్టారు.

ఇంతటి ఘనవిజయాన్ని ఇచ్చిన రాజమౌళికి మరియు ఇలాంటి అల్టిమేట్ కథని అందించిన విజయేంద్ర ప్రసాద్ కి రామ్ చరణ్ ఇప్పటి వరకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేయలేదు…కానీ రామ్ చరణ్ ఈ విషయాన్నీ స్వయంగా ప్రస్తావిస్తూ….

తనకి ఇది గత 9 ఏళ్లుగా పబ్లిక్ గా చెప్పాలి అని కోరిక ఉన్నా చెప్పే వేదిక దొరకలేదని..కానీ ఇప్పుడు శ్రీవల్లీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఓపెన్ గా చెబుతున్నా నాకి మగధీర అలంటి సినిమా ఇచ్చినందుకు రాజమౌళికి విజయేంద్రప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు అంటూ రామ్ చరణ్ ఔన్నిత్యానికి అభిమానులు అందరూ శెభాష్ అనకుండా ఉండలేకపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here