ఇదీ న్యూస్ అంటే… రామ్ చరణ్ ర్యాంక్ 3…ఫ్యాన్స్ కి పూనకాలే

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ రంగస్థలం 1985 రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలియదు కానీ రిలీజ్ కి ముందు మాత్రం భీభత్సాలు సృష్టిస్తుంది అని చెప్పొచ్చు…భారీ అంచనాల నడుమ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలివుడ్ లో ఓ క్లాసిక్ లా మిగిలి పోవడం గ్యారెంటీ అంటూ చెప్పు కుంటుండటంతో మెగా ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

కాగా సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉన్నా బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తూ దూసుకు పోతున్న రంగస్థలం 1985 ఆడియో రైట్స్ పరంగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఆల్ టైం మూడో బిగ్గెస్ట్ రేటు ని దక్కించు కుని రామ్ చరణ్, సుకుమార్ మరియు దేవి శ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పకనే చెప్పింది.

మొదటి ప్లేస్ లో పవన్ త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసి 2 కోట్ల రేటు దక్కించుకోగా తర్వాత మహేష్ కొరటాల శివ ల భరత్ అనే నేను కూడా 2 కోట్ల రేటు ని దక్కించుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ సుకుమార్ ల రంగస్థలం కి 1.6 కోట్ల రేటు తో మూడో ప్లేస్ దక్కింది. ఇవన్నీ బాహుబలి సినిమాను పక్కకు పెడితే టాప్ 3 లో ఉన్న సినిమాలు.

Leave a Comment