మెగాస్టార్ తోపే….104 కొట్టినా…ఈ ఇయర్ రికార్డ్ మాత్రం ఎన్టీఆర్ దే

0
1403

  ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో బాహుబలి ని పక్కకు పెడితే భారీ చర్చలు జరిగిన సినిమా మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ చేసిన ఖైదీనంబర్ 150…. 10 ఏళ్లుగా వెండితెరకు బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ గా కోలివుడ్ బ్లాక్ బస్టర్ కత్తి ని ఖైదీనంబర్ 150 గా రీమేక్ చేసి అందరి లెక్కలు తెల్చుతూ ఏకంగా 104 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించి తానె నం1 ని తేల్చేశాడు.

అలాంటి సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు…కానీ ఇంత చేసినా ఈ ఇయర్ ఫేస్ బుక్ లో అత్యధిక చర్చలు జరిగిన సినిమా గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమా బాహుబలి తర్వాత స్థానాన్ని దక్కించుకుని టోటల్ టాలీవుడ్ కి షాక్ ఇచ్చింది.

ఈ రికార్డ్ ఆల్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన మూవీస్ విషయం లో అవ్వడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా క్రేజ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. జైలవకుశ సినిమాకి మిగిలిన సినిమాల్లా భారీ హంగులు లేవు…కేవలం ఎన్టీఆర్ పేరు మీదే ఈ రేంజ్ రచ్చ చేసి సంచలనం సృష్టించింది జైలవకుశ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here