చిరు 15.2 కొడితే…చరణ్ చుక్కలు చూయించాడు సామి!!

0
371

  టాలీవుడ్ లో అనేక రికార్డులను బాహుబలి సొంతం చేసుకుంది… ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కానీ అంతకుముందు ఉన్న సినిమాలలో కానీ కొన్ని సినిమాల రికార్డులు మాత్రమె బాలెన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని బ్రేక్ అయ్యాయి. ఇక కొత్త రికార్డులలో మెగా స్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ చేసిన లేటెస్ట్ మూవీ ఖైదీనంబర్ 150 బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులను నమోదు చేస్తూ చరిత్ర కెక్కె రేంజ్ లో 104 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక సినిమా సీడెడ్ ఏరియాలో ఆల్ టైం రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో టోటల్ రన్ లో 15.2 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో ఈ రికార్డును ఏ సినిమా కూడా అందుకోలేక పోయింది.

కానీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగస్థలం రిలీజ్ అయిన 18 రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 15.4 కోట్ల షేర్ ని క్రాస్ చేసి ఖైదీనంబర్ 150 నెలకొల్పిన ఇండస్ట్రీ రికార్డ్ ను బ్రేక్ చేసి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here