మెగాస్టార్ సినిమాకే షాక్ ఇచ్చిన నాని సినిమా…టాప్ 2 ప్లేస్ తో రచ్చ

ఈ ఇయర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఆ అంచనాలను అందుకుని 100 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనంబర్150 బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన మ్యాజిక్ ని బుల్లితెరపై చేయలేకపోయింది.

కేవలం 9.85 టి.ఆర్.పి రేటింగ్ ని మాత్రమె దక్కించుకుని షాక్ ఇవ్వగా ఈ ఇయర్ ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో శతమానంభవతి 15.21 టి.ఆర్.పి రేటింగ్ తర్వాత స్థానాన్ని దక్కించుకుంది. కాగా అంతకుముందు టెలికాస్ట్ అయిన నాని నేనులోకల్ మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు 9.11 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది.

కాగా రెండోసారి టెలికాస్ట్ అయినప్పుడు అందరికీ షాక్ ఇస్తూ ఏకంగా 12.2 టి.ఆర్.పి రేటింగ్ దక్కించుకుని చిరు సినిమాను దాటేది ఇప్పటివరకు ఈ ఇయర్ లో వచ్చిన సినిమాల్లో టాప్ 2 టి.ఆర్.పి రేటింగ్ దక్కించుకుని షాక్ ఇచ్చింది.

Leave a Comment