చిరు ఫస్ద్ డే రికార్డ్ పై కన్నేసిన ఎన్టీఆర్…కొడతాడా లేదా??

0
7515

ఈ ఇయర్ స్టార్టింగ్ లో భారీ సంక్రాంతి పోటి లో రిలీజ్ అయిన ఖైదీనంబర్ 150 బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది..తొలి రోజు ఈ సినిమా ఏకంగా బాహుబలి పార్ట్ 1 రికార్డులు బ్రేక్ చేసి 23.22 కోట్ల షేర్ ని వసూల్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో భీభత్సం సృష్టించింది..ఈ రికార్డును పవర్ స్టార్ కాటమరాయుడు తో బ్రేక్ చేస్తాడు అనుకున్నా 22 కోట్ల లోపే ఆగిపోయి చిరు కి టాప్ ప్లేస్ ని ఇచ్చేశాడు.

ఇక ఇప్పుడు బాహుబలి 2 తర్వాత భారీగా పెరిగిన మార్కెట్ ఎక్స్ పాన్షన్ ను వాడుకుని మన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ఓ రేంజ్ లో రావడం ఖాయమని అంతా అంటున్నారు. మరి మొదటి రోజు ఈ రికార్డును యంగ్ టైగర్ ఎన్టీఆర్ జైలవకుశ బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

జనతాగ్యారేజ్ తో 20 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన ఎన్టీఆర్ కి ఇప్పుడు ఖైదీనంబర్150 ని క్రాస్ చేయడం పెద్ద కష్టం కాదని…అన్నీ కుదిరితే అంతకు మించి కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు,  మరి ఏం జరుగుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here