Day 4 ఓ రేంజ్ లో కుమ్మేసిన జై సింహా…బాలయ్య మాస్

0
776

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో మంచి వసూళ్లు సాధించింది… 4 వ రోజు అసలు సిసలు సంక్రాంతి హాలిడే అవ్వడంతో బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేసుకుంది ఈ సినిమా… పోటి లో ఉన అజ్ఞాతవాసి మరియు గ్యాంగ్ సినిమాల కన్నా కూడా సూపర్బ్ లీడింగ్ తో కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా రోజుని అద్బుతంగా ముగించింది అని చెప్పొచ్చు.

రాయలసీమ ఏరియాలో మొదటి రోజు తర్వాత ది బెస్ట్ కలెక్షన్స్ ని 4 వ రోజు సాధించిన జై సింహా నైజాం మరియు టోటల్ ఆంధ్రా ఏరియాలలో 4 వ రోజు సూపర్బ్ గా పుంజుకుంది. దాంతో మొదటి రోజు తర్వాత హైయెస్ట్ డే కలెక్షన్స్ ని సినిమా 4 వ రోజు అందుకోనుంది.

ఇంకా ఏరియాల వారిగా రిపోర్ట్స్ రాలేదు కానీ సినిమా మొత్తంగా 3 కోట్లకు పైగానే షేర్ ని 4 వ రోజు అందుకుందని అంటున్నారు…ఇది నిజంగానే అద్బుతం అని చెప్పొచ్చు. సినిమా బడ్జెట్ ఓన్ రిలీజ్ దృశ్యా మొదటి వారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here