ధృవ 6.9…..రంగస్థలం 7.8…మగధీరుడా–మజాకా!!

0
336

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి టాలీవుడ్ హిస్టరీ లోనే ఏ హీరో కి లేని రేర్ రికార్డులు ఎన్నో ఉన్నాయి. కెరీర్ లో రెండో సినిమా తోనే సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను అందుకున్న ఘనత ఒక్క రామ్ చరణ్ కే సొంతం అని చెప్పాలి. టాలీవుడ్ లో పెను సంచలన రికార్డులను రెండో సినిమా తో అందుకున్న రామ్ చరణ్ మళ్ళీ ఇప్పుడు రంగస్థలం సినిమా తో చరిత్ర కెక్కాడు.

కాగా ఈ సినిమా తో ఇటు రెండు రాష్ట్రాల్లో అటు పక్క రాష్ట్రాలలోను అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్నాడు రామ్ చరణ్. తన కెరీర్ లో క్లాస్ మూవీ కం ఫస్ట్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయిన ధృవ సినిమాతో ఓవర్సీస్ లోనే కాదు కర్ణాటకలో కూడా కెరీర్ బెస్ట్ రికార్డ్ కొట్టాడు రామ్ చరణ్.

ఆ సినిమా కర్ణాటక లో 6.9 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు రంగస్థలం సినిమా రెండు వారాల్లో అఫీషియల్ గా 8 కోట్ల వరకు షేర్ ని అందుకుంది. అందులో 20 లక్షల ఓవర్ ఫ్లో కలెక్షన్స్ రెండో వారంలో వచ్చాయి అంటే ఏ రేంజ్ లో కుమ్మేసిందో అర్ధం చేసుకోవచ్చు. మరి టోటల్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here