దీపావళి కి మెగా ఫ్యాన్స్ కి పూనకాలే…కాచుకోండి

  ఫిదా సూపర్ సక్సెస్ తర్వాత మెగా హీరోల సినిమాలు ఇప్పటి వరకు ఏవి రిలీజ్ కాలేదు…..త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ఒక్క సాయిధారం తేజ్ జవాన్ ఒక్కటే…అది పక్కకు పెడితే మెగా ఫ్యాన్స్ అందరు పవర్ స్టార్ 25 వ సినిమా కోసం అలాగే రామ్ చరణ్ రంగస్థలం 1985 కోసం ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ దీపావళి మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సర్ ప్రైజ్ లు తీసుకు వచ్చే చాన్స్ ఉందని సమాచారం.

పవన్ కళ్యాణ్ 25 వ సినిమా ఫస్ట్ లుక్ అలాగే రామ్ చరణ్ రంగస్థలం 1985 ఫస్ట్ లుక్ లు రిలీజ్ కాబోతున్నాయని అంటున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుండే దీపావళి కోసం ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ రెండు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాబోతున్నట్లు సమాచారం. పోటిలో నుండి మహేష్ భరత్ అనే నేను ఆల్ మోస్ట్ తప్పుకున్నట్లే నని దాంతో మెగా మూవీస్ రెండు సంక్రాంతి బరిలో నిలిచే చాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Comment