డీజే నష్టాలు…ఫిదా లాభాలు…రెండు అల్టిమేట్ గా మ్యాచ్ చేసిన దిల్ రాజు

ఈ ఇయర్ ఫస్టాఫ్ ఎండింగ్ సమయంలో భారీ అంచనాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన డీజే అనుకున్న అంచనాలను అందుకోలేకపోయినా టోటల్ రన్ లో 70 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది.

కానీ ఓవర్సీస్ మరియు కర్ణాటకలో సినిమాకు నష్టాలు వచ్చాయి, ముఖ్యంగా ఓవర్సీస్ లో సినిమాకు భారీ నష్టాలు రాగా ఏకంగా 4.5 కోట్ల మేర నష్టపోవడంతో దిల్ రాజు అక్కడి డిస్ట్రిబ్యూటర్లకి తన తరువాత సినిమాలతో ఆ నష్టాలను పూరుస్తానని మాట ఇచ్చాడట…

ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఫిదా ఓవర్సీస్ లో అదిరిపోయే వసూళ్ళతో సంచలనం సృష్టిస్తుండటంతో ఫిదా లాభాలను డీజే నష్టాల కింద రిఫండ్ ఇస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఓ పెద్ద హీరో నటించిన సినిమా నష్టాలను ఓ చిన్న సినిమా తీర్చడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.

Leave a Comment