రచ్చ లేపే కాంబో..ఎన్టీఆర్28…థియేటర్లు దద్దరిల్లడం ఖాయం

0
3995

  టాలీవుడ్ తలైవా యంగ్  టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేస్తుండ గా ఎన్టీఆర్ నటించబోయే అప్ కమింగ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం కొన్ని నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొన గా ఇంత లో స్పెషల్ ట్రైనింగ్స్ తీసుకోవ డానికి సిద్ధం అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోతున్న ఈ సినిమా 2018 వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటని చెప్పొచ్చు. భారీ అంచనాలతో మొదలు కాబోతున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడి గా ఎవరు పని చేస్తారు అనేది చాలా రోజులుగా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.

దేవి శ్రీ ప్రసాద్ పేరు గట్టిగానే వినిపించినా ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ ల సినిమాకి అద్బుతంగా సంగీతం అందించాడు అని అంటున్న అనిరుద్ ని ఎన్టీఆర్ కి ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసినట్లే నని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మాస్ హీరో అయిన ఎన్టీఆర్ కి కత్తి రేంజ్ ఆల్బం ఇస్తే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here