ఏ హీరోకి అందనంత ఎత్తులో యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఈ రికార్డే సాక్ష్యం

వెండితెర అయినా బుల్లితెర అయినా తనకి తిరుగులేదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి ఋజువు చేసుకున్నాడు…వెండితెరపై అద్బుతాలు సృష్టిస్తూనే ఇప్పుడు బుల్లితెరపై అడుగుపెట్టిన యంగ్ టైగర్ బిగ్ బాస్ షో ద్వారా అల్టిమేట్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.

మొదటి ఎపిసోడ్ తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ ఇతర స్టార్స్ హోస్ట్ చేస్తున్న షోల కన్నా ఆల్ టైం రికార్డ్ టి.ఆర్.పి తో దుమ్ము రేపాడు…ఎన్టీఆర్ భీభత్సం ఏ రేంజ్ లో ఉందీ అంటే…తొలి ఎపిసోడ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.2 కోట్లమంది చూశారట.

ఇది ఆల్ టైం టెలివిజన్ రికార్డ్ అని అంటున్నారు. ఇదివరకు మీలో ఎవరు కోటీశ్వరుడు తొలి సీజన్ తొలి ఎపిసోడ్ కి 2.9 కోట్లమంది చూడగా ఇప్పుడు ఎన్టీఆర్ షోకి ఇంతమంది వ్యూవర్స్ ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు…దాంతో మిగిలిన హిరోలకన్నా ఎన్టీఆర్ ఎంత ముందున్నాడో చెప్పడానికి ఇదే నికార్సయిన ఉదాహరణ అని అంటున్నారు.

Leave a Comment