మహేషా ఈసారి గట్టిగా కొట్టాలి…కాచుకోండి

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ప్రస్తుతం టైం పెద్దగా కలిసి రావడం లేదు. శ్రీమంతుడు తో సెన్సేషన్ క్రియేట్ చేసినా అంతకుముందు 1 నేనొక్కడినే, ఆగడు…. శ్రీమంతుడు తర్వాత బ్రహ్మోత్సవం మరియు స్పైడర్ సినిమాలు మహేష్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ గా నిలిచాయి. ఇలాంటి సమయంలో మహేష్ ఆశలన్నీ భరత్ అనే నేను పైనే పెట్టుకున్నాడు. అభిమానులు కూడా ఈ సినిమాతో అనేక ప్రశ్నలకు సమాదానం చెప్పాలనుకుంటున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో మహేష్ డ్యూయల్ రోల్ చేసే చాన్స్ ఉన్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. కాగా సినిమాలో మహేష్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ కేర్ తో ఊరమాస్ ఫైట్ సీన్స్ ని పవర్ ఫుల్ డైలాగ్స్ ని కొరటాలని అడిగి మరి పెట్టుకున్నాడని సమాచారం.

థియేటర్స్ లో ఆ డైలాగ్స్ కి అప్లాజ్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని ఇప్పటి నుండే చెప్పుకుంటున్నారు. స్పైడర్ సినిమా ఇచ్చిన రిజల్ట్ చూసి ఈ సినిమాపై ఎంత టెన్షన్ ఉన్నా ఈ సారి మాత్రం గట్టిగా కొట్టడం ఖాయమని మహేష్ అభిమానులు ఎంతో ఆశగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Leave a Comment