ఈ సెంటిమెంట్ నిజం…చరిత్రకెక్కే హిట్ ఎన్టీఆర్ సొంతం!!

0
963

  హిట్టు కొట్టిన డైరెక్టర్ల వెంటపడతాడంటూ గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఒక చెడ్డ పేరుండేది. ‘కిక్’ తర్వాత సురేందర్ రెడ్డితో.. ‘దూకుడు’ తర్వాత శ్రీను వైట్లతో.. ‘కందిరీగ’ తర్వాత సంతోష్ శ్రీనివాస్ తో సినిమాలు చేశాడతను. కానీ అతను ఆశించిన ఫలితాలు ఎదురవ్వలేదు. కానీ ఎప్పుడైతే పూరి జగన్నాథ్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేశాడో అప్పుడే ఎన్టీఆర్ దశ తిరిగింది. ‘హార్ట్ అటాక్’ లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ మంచి విజయం సాధించింది.

అక్కడి నుంచి ఎన్టీఆర్ విన్నింగ్ స్ట్రీక్ కొనసాగుతోంది. ఆ తర్వాత ‘1 నేనొక్కడినే’ లాంటి డిజాస్టర్ తీసిన సుకుమార్ దర్శకత్వంలో తారక్ ‘నాన్నకు ప్రేమతో’లో నటించాడు. అది హిట్టయింది. ఆపై ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి డిజాస్టర్ చేసిన బాబీకి అవకాశమిచ్చాడు తారక్. ‘జై లవకుశ’ బయ్యర్లకు స్వల్పంగా నష్టాలు తెచ్చిపెట్టిన విషయం నిజమే కానీ.. నిర్మాత కళ్యాణ్ రామ్కు మాత్రం భారీగానే లాభాలందించింది. తారక్ కు నటుడిగా మంచి పేరొచ్చింది. ఈ సినిమాకు లాభాల వాటా రూపంలో తన కెరీర్లోనే అత్యధిక పారితోషకం అందుకున్నడు తారక్. ఇలా గత కొన్నేళ్లలో ఫ్లాప్ డైరెక్టర్లతో జత కట్టి మంచి ఫలితాలందుకున్నాడు తారక్.

ఇప్పుడతను ‘అజ్ఞాతవాసి’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జత కట్టబోతున్నాడు. ‘అజ్ఞాతవాసి’ ఫలితం చూసి భయపడాల్సిన పని లేదని.. సెంటిమెంటు కొనసాగి ఎన్టీఆర్ కు అతను హిట్టే ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా హల్ చల్ చేస్తుండటం విశేషం. మరి నిజంగానే తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మంచి హిట్టొస్తుందేమో చూద్దాం.

Related posts:

58 నిమిషాల్లో 1 మిలియన్ టాలీవుడ్ నయా ఇండస్ట్రీ రికార్డ్ ఇది
బాహుబలి ఫస్ట్—జైలవకుశ సెకెండ్...హ్యుమంగస్ రికార్డ్ ఇది
ఇది కదా అసలు సిసలు న్యూస్...ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఇది
రిలీజ్ డేట్ ని మార్చుకోమని ఎన్టీఆర్ పై ప్రెజర్...ఏం జరుగుతుందో
ఫిదా మూడో రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
పవన్ కళ్యాణ్ హిస్టారికల్ 23.84 రికార్డును బ్రేక్ చేసే హీరో ఎవరు ??
అల్లుఅర్జున్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
చిరంజీవి 4.48...ఎన్టీఆర్ 4.51...న్యూ ఇండస్ట్రీ రికార్డ్
2 విషయాల్లో తీవ్రంగా హార్ట్ అయిన మెగా ఫ్యాన్స్...అవి ఏంటి అంటే??
10 కోట్ల బడ్జెట్...8 కోట్లకు అమ్మితే టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎట్టకేలకు హలో సినిమాతో ఒక్క రికార్డ్ కొట్టిన అఖిల్...
ఛలో మూవీ రివ్యూ....సూటిగా సుత్తి లేకుండా!!
10 కోట్ల బిజినెస్...టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
ఎన్టీఆర్ ప్లేస్ లో అల్లుఅర్జున్ కాదు...ఈ హీరోనే...తెలిస్తే షాక్ అవుతారు??
ఫిదా 5 సారి TRP రేటింగ్...ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here