ఈ టాక్ తో సంచలన రికార్డ్ సృష్టించిన పవర్ స్టార్…కానీ

0
874

     పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ ల కంబో లో వచ్చిన అజ్ఞాతవాసి ఇక్కడ పరిస్థితి ఏది ఎలా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు అజ్ఞాతవాసి. ఆదివారం దాకా పూర్తైన రన్ ని పరిగణనలోకి తీసుకుంటే రెండు మిలియన్ డాలర్ల మార్క్ ని విజయవంతగా పూర్తి చేసుకున్నాడు. పవన్ అల్ టైం హిట్ అత్తారింటికి దారేది ఫుల్ రన్ లో తెచ్చింది 1.89 మిలియన్ డాలర్లు మాత్రమే.

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇది మొదటి సారి కాగా త్రివిక్రమ్ లాస్ట్ మూవీ అ ఆ కూడా 2 మిలియన్ మార్క్ అందు కుంది. దీన్ని బట్టి త్రివిక్రమ్ బ్రాండ్ అక్కడ ఎంత బలం గా ఉందో అర్థమవు తోంది. భారీ నెంబర్ స్క్రీన్ లలో ప్రీమియర్ షో లు వేయటం దీని కి ప్రధాన కారణం అని తెలు స్తోంది.

పైగా పవన్-త్రివిక్రమ్ కాంబో అనేసరి కి మినిమం గ్యారెంటీ ఉంటుంది అనే నమ్మకం తోనే అడ్వాన్స్ బుకింగ్స్ బ్రహ్మాండం గా జరి గాయి. టాక్ తేడా గా వచ్చినప్పటి కి ఓ సారి చూద్దాం అనుకున్న ప్రేక్షకులు కూడా బాగానే ఉన్నారు అక్కడ.

ప్రస్తుతానికి ఎనిమిదో స్థానంలో ఉన్న అజ్ఞాతవాసి మరో వారం లేదా పది రోజులు ఎంత చేస్తాడు అనే దాన్ని బట్టి ప్లేస్ డిసైడ్ అవుతుంది. ఇప్పటికే టాప్ 2 ప్లేసెస్ బాహుబలి 2 బాహుబలి ఆక్రమించుకోగా మూడు నాలుగు స్థానాల్లో శ్రీమంతుడు అఆ ఉన్నాయి. ఐదు మెగాస్టార్ ఖైది నెంబర్ 150 తీసుకుంటే ఆరో స్థానం ఫిదా లాగేసుకుంది.

ఏడులో జూనియర్ నాన్నకు ప్రేమతో ఉంది.మరో పాతిక వేల డాలర్లు కనక అజ్ఞాతవాసి రాబడితే నాన్నకు ప్రేమతో క్రాస్ చేయొచ్చు.ఈ టాక్ తో ఇలా సంచలన కలెక్షన్స్ ని సాధించడం పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ కే చెల్లింది అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here