ఫిదా టోటల్ కలెక్షన్స్…టాలీవుడ్ చరిత్రకెక్కిన చిన్న సినిమా చరిత్ర ఇది

0
525

ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి అంచనాలకు మించి వసూళ్ళ వర్షం కురిపించే సినిమాలు చాలా తక్కువగానే ఉంటాయి…అలాంటి సినిమాలలో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ మరియి సాయిపల్లవి ల కాంబినేషన్ లో తెరకెక్కిన సెన్సేషన్ ఫిదా సినిమా కూడా కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. రిలీజ్ కి ముందు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి తర్వాత భీభత్సం సృష్టించింది ఈ సినిమా. 

రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ ని పూర్తి చేసిన ఈ సినిమా కొన్ని ఏరియాలలో మినిమమ్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది…కాగా టోటల్ రన్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 48.45 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది.

కాగా అందులో ఓవర్సీస్ నుండి 2 మిలయన్ డాలర్స్ అలాగే నైజాం ఏరియా నుండి 17.7 కోట్ల షేర్ ని అందుకోవడం అల్టిమేట్ రికార్డ్ అని చెప్పొచ్చు. కేవలం 8 కోట్ల బడ్జెట్ తో 18 కోట్ల బిజినెస్ తో టోటల్ రన్ లో 48.45 కోట్ల మార్క్ అందుకున్న ఈ సినిమా సృష్టించిన చరిత్ర టాలీవుడ్ లో నిలిచిపోవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here